'ఆదిపురుష్' లో మరో సూపర్ స్టార్..?

Tue May 04 2021 09:00:02 GMT+0530 (IST)

Another superstar in 'Adipurush'

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో ''ఆదిపురుష్'' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టీ-సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ - క్రిషన్ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు. అలానే సీత పాత్రలో బాలీవుడ్ భామ కృతి సనన్.. రావణుడిగా సైఫ్ అలీఖాన్.. లక్ష్మణుడిగా సన్నీ సింగ్ నటిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ చిత్రంలో మరో సౌత్ స్టార్ హీరో నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.కన్నడ సూపర్ స్టార్ సుదీప్ 'ఆదిపురుష్' చిత్రంలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది. లంకాధిపతి రావణాసురుడి సోదరుడు విభీషణుడి పాత్రలో కిచ్చ సుదీప్ కనిపించనున్నారట. సుదీప్ ఇంతకుముందు 'బాహుబలి' సినిమాలో గెస్ట్ రోల్ ప్లే చేశాడు. ఇప్పుడు మరోసారి ప్రభాస్ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. కాగా 3డీ టెక్నాలజీలో తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషలతో పాటుగా పలు విదేశీ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ముంబైలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో ఈ సినిమా షూటింగ్ జరుపుతున్నారు. 'ఆదిపురుష్' చిత్రాన్ని 2022 ఆగస్టు 11న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.