Begin typing your search above and press return to search.

ప్రొడ్యూసర్ గా మారుతున్న మరో స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 3:30 AM GMT
ప్రొడ్యూసర్ గా మారుతున్న మరో స్టార్ హీరో..!
X
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు హీరోలందరూ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వేరే బిజినెస్ లు స్టార్ట్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మరికొందరు సినిమాల్లో హీరోలుగా నటిస్తూనే, ప్రొడ్యూసర్ గా మారి నిర్మాణంలో భాగస్వామ్యం పంచుకుంటున్నారు. వారిలో ఇంకొందరు బయట హీరోలతో కూడా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకూ ఇప్పుడు దాదాపు అందరు స్టార్ హీరోలకు సొంత నిర్మాణ సంస్థలు ఉన్నాయి. లేటెస్టుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ కూడా ప్రొడ‌క్ష‌న్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.

బాలీవుడ్ సస్టార్ హీరోల్లో ఒకరైన హృతిక్ రోషన్ తన పేరు మీదుగా ఓ బ్యానర్ స్థాపించి నిర్మాతగా మారాలని ఆలోచిస్తున్నారట. దీనికి 'హృతిక్ రోష‌న్ ఫిల్మ్స్' అని పేరు పెట్టి, అందులో చిన్న మీడియం త‌ర‌హా హిందీ సినిమాలు తీయ‌డానికి హీరో ప్లాన్ చేస్తున్న‌ట్లుగా బీ టౌన్ వర్గాలు చెబుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోల్లో 'స‌ల్మాన్ ఖాన్ ఫిల్మ్స్'.. అమీర్ ఖాన్ 'అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్'.. షారుఖ్ ఖాన్ 'రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్'.. అక్షయ్ కుమార్ 'హరి ఓం ఎంటర్టైన్మెంట్స్' అనే నిర్మాణ సంస్థలు స్థాపించి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరి జాబితాలో హృతిక్ కూడా జాయిన్ అవుతారని అంటున్నారు.