ప్రభాస్ బ్యానర్ నుంచి మరో ప్రొడక్షన్ కంపనీ

Sat May 14 2022 06:00:01 GMT+0530 (IST)

Another production company from Prabhas Banner

టాలీవుడ్ లో ముందు నుంచి హీరోలు నిర్మాతలు దర్శకులతో పాటు నిర్మాణ సంస్థలకు కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేకత వుంటూ వస్తోంది. పలానా సంస్థ నుంచి సినిమా అంటే ప్రేక్షకులు ప్రత్యేకంగా చూస్తూ వస్తున్నారు. ఏవీఎం సంస్థ నుంచి సురేష్ ప్రొడక్షన్స్ వరకు క్రేజీ నిర్మాణ సంస్థలు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి. నేటి తరం నిర్మాణ సంస్థల్లో దిల్ రాజు సంస్థతో పాటు పలు ప్రొడక్షన్ కంపనీలు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు యువీ క్రియేషన్స్. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దీనికి బ్యాక్ బోన్ గా వున్నారు. దీంతో ఈ సంస్థ అనతి కాలంలోనే టాప్ ప్రొడక్షన్ కంపనీల్లో ఒకటిగా నిలబడింది. మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది. వంశీ ప్రమోద్ నిర్మాతలుగా వ్యవహరిస్తూ సరికొత్త సినిమాలకు ఈ సంస్థలో శ్రీకారం చుడుతున్నారు. ఎక్కువ శాతం ప్రభాస్ తో భారీ చిత్రాలని నిర్మించిన ఈ మేకర్స్ త్వరలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నారు.  

టాలీవుడ్ లో ఎన్ని క్రేజీ ప్రొడక్షన్ కంపనీలు వున్నా యువీ క్రియేషన్స్ కున్న ప్రత్యేకతే వేరు. భారీ చిత్రాలతో పాటు మినిమమ్ రేంజ్ హీరోల చిత్రాలని కూడా నిర్మిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. అంతే కాకుండా చిన్న సినిమాల కోసం 'యువీ 2' అనే బ్యానర్ ని కూడా స్టార్ట్ చేశారు. దీనిపై ఇప్పటికే పలు చిన్న సినిమాలని ప్రేక్షకులకు అందించి విజయాలు సొంతం చేసుకున్నారు. దీనికి కూడా వంశీ ప్రమోద్ లే నిర్మాతలుగా వ్యవహరిస్తూ చిన్న చిత్రాలని ప్రోత్సహిస్తున్నారు.

ఇదిలా వుంటే తాజాగా ఈ సంస్థ నుంచి మరో బ్యానర్ రాబోతోందని తెలిసింది. అయితే దీనికి వంశీ మాత్రమే ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారట. అంటే ఇది యువీ ఉమ్మడి ప్రొడక్షన్ కంపనీ కాదన్నమాట. ఓన్లీ వంశీ కి సంబంధించిన ప్రొడక్షన్ కంపనీ అని తెలుస్తోంది. ఈ బ్యానర్ పై స్మాల్ మూవీస్ మీడియం రేంజ్ చిత్రాలని మాత్రమే నిర్మిస్తారట. ఇందులో ప్రభాస్ భాగస్వామిగా వుంటారా?  లేదా అన్నది మాత్రం తెలియాల్సి వుంది.

ప్రస్తుతం యువీ క్రియేషన్స్ బ్యానర్ లో నవీన్ పొలిశెట్టి అనుష్క శెట్టిల కలయికలో ఓ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో వున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన అప్ డేట్ ఇంత వరకు బయటికి రాలేదు. త్వరలోనే అఫీషియల్ గా మేకర్స్ అప్ డేట్ ఇచ్చే అవకాశం వుందని తెలిసింది.