హీరోగా మరో నిర్మాత తనయుడు.. పక్కా ప్లాన్ రెడీ!

Fri Jan 22 2021 08:00:01 GMT+0530 (IST)

Another producer Son As a hero

సహజంగా.. హీరోల వారసులే ఎక్కువగా తెరంగేట్రం చేస్తుంటారు. కానీ.. నిర్మాతల కుమారులు కూడా హీరోలుగా మారుతున్నారు. నటించడమే కాదు..  బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్నారు. స్టార్ హీరోలుగా ఎదుగుతున్నారు. వీరిలో.. వెంకటేష్ అల్లు అర్జున్ బెల్లంకొండ శ్రీనివాస్ వంటి వారు ప్రముఖంగా ఉన్నారు. అయితే.. ఇప్పుడు వీరి బాటలోనే మరో ప్రముఖ నిర్మాత తనయుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.నందమూరి బాలకృష్ణతో 'కృష్ణబాబు' ప్రభాస్ తో 'అడవి రాముడు' ఎన్టీఆర్ తో 'అల్లరి రాముడు' వంటి చిత్రాలను నిర్మించిన చంటి అడ్డాల.. తన తనయుడిని హీరోగా పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే.. ఆషామాషీగా కాకుండా పక్కా ప్రణాళికతో వారసుడిని ఇండస్ట్రీలో లాంచ్ చేయడానికి రెడీ అయ్యారు అడ్డాల.

ఇందుకోసం ప్రముఖ దర్శకుడిని ఎంచుకున్నారు. ఆయనెవరో కాదు.. 'కొత్త బంగారు లోకం' 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' 'ముకుంద' చిత్రాలు రూపొందించి తన స్టామినా ఏంటో నిరూపించుకున్న శ్రీకాంత్ అడ్డాల. ఇక ఈ మూవీని నిర్మించబోతోన్నది చంటి అడ్డాల కాదు. హిట్ చిత్రాలను నిర్మిస్తూ.. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న బన్నీ వాసు!

'కూచిపూడి వారి వీధిలో' అనే ఆసక్తికరమైన టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పూర్తిగా గోదావరి జిల్లాల పరిధిలో సాగే కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపుదిద్దుకోనుందట. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రానుందని సమాచారం.