కొరటాలతో మరో సినిమా.. ఎన్టీఆర్ లైనప్ అదిరిపోయిందిగా..!

Tue Feb 23 2021 17:00:01 GMT+0530 (IST)

Another movie with Koratala .. NTR lineup

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. దసరా కానుకగా అక్టోబర్ 13న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకోనున్న తారక్.. దాన్ని నిలబెట్టుకునే విధంగా సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. తారక్ 'ఆర్.ఆర్.ఆర్' షూట్ కంప్లీట్ చేసిన వెంటనే 'ఎన్టీఆర్30' సినిమాని స్టార్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇదే క్రమంలో 'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చేయనున్నాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్ లో మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. దీని తర్వాత 'జనతా గ్యారేజ్' వంటి సూపర్ హిట్ ఇచ్చిన కొరటాల శివ తో తారక్ మరో సినిమా చేయనున్నాడట. దీంతో పాటే తన సొదరుడు కళ్యాణ్ రామ్ తో కలిసి ఓ సినిమా ఉంటుందని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా దర్శకుడు డిసైడ్ అవ్వలేదు కానీ ఇది హోమ్ బ్యానర్ లోనే ఉంటుందని టాక్ నడుస్తోంది. ఇదంతా చూసుకుంటే యంగ్ టైగర్ డేట్స్ 2024 వరకు ఖాళీ లేవనే అనుకోవాలి.