Begin typing your search above and press return to search.

మరో హీరోయిన్‌.. ప్రభాస్ నిజంగా డార్లింగ్‌

By:  Tupaki Desk   |   29 Jan 2022 9:30 AM GMT
మరో హీరోయిన్‌.. ప్రభాస్ నిజంగా డార్లింగ్‌
X
యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ తో ఒక్క సినిమాకు వర్క్‌ చేస్తే పాన్ ఇండియా స్టార్‌ గా మారిపోవడం ఖాయం. ఇప్పుడు ఆయన ఓ పాన్ ఇండియా సూపర్‌ స్టార్‌. ఏ ఇండియన్ స్టార్‌ కు.. ఏ బాలీవుడ్‌ పెద్ద హీరోలకు సాధ్యం కాని సినిమాలను ఇప్పుడు ప్రభాస్ చేస్తున్నాడు. ముందు ముందు ఆయన నుండి రాబోతున్న సినిమాల వసూళ్లు మినిమం మూడు నాలుగు వందల కోట్లు ఉండబోతున్నాయి. ఆ స్థాయిలో ఇండియన్ సినిమా స్థాయిని ఉన్నత స్థితికి తీసుకు వెళ్లిన ప్రభాస్‌ స్వభావం గురించి ఇప్పటి వరకు ఎంతో మంది చెప్పారు.. ప్రతి ఒక్కరు కూడా ఒకే తరహా లో చెప్పుకొచ్చారు. ప్రభాస్ చిన్న పిల్లాడి మనస్థత్వం.. అతడితో ఉంటే మర్యాదలతో మతులు పోగొట్టేస్తాడు.. ప్రతి నిమిషం కూడా చిల్‌ అంటూ తన చుట్టు ఉన్న వారిని కూడా నవ్విస్తూ ఉంటాడు. ప్రభాస్‌ డైరెక్టర్ నుండి లైట్‌ అసిస్టెంట్‌ వరకు ప్రతి ఒక్కరిని ఒకే తరహా గౌరవంతో పిలుస్తాడు. తాను ఎంత పెద్ద స్టార్‌ అయినా కూడా ప్రతి ఒక్కరిని గౌరవించడం ఆయన నైజం అంటూ ఆయనతో వర్క్ చేసిన పలువురు చెప్పుకొచ్చారు. ఆయన ఇంటి నుండి తెప్పించిన వంటలను రుచి చూసిన వారు ఖచ్చితంగా ఆహా అనాల్సిందే. తాజాగా ప్రభాస్ కు ఫిదా అయిన వారిలో హీరోయిన్ శృతి హాసన్‌ కూడా చేరింది.

ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సలార్‌ సినిమా లో శృతి హాసన్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. కేజీఎఫ్‌ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న సలార్‌ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరింది. అన్ని అనుకున్నట్లుగా జరిగి ఉంటే మొన్న సంక్రాంతికి ఈసినిమా విడుదల అయ్యి ఉండేది. కాని కరోనా వరుస వేవ్‌ లు సినిమా ను ముందుకు సాగనివ్వడం లేదు. ప్రభాస్ తో ఇప్పటికే కీలక సన్నివేశాల చిత్రీకరణ లో పాల్గొన్న శృతి హాసన్‌ మరో షెడ్యూల్‌ ను కూడా చేయాల్సి ఉంది. ప్రభాస్ తో శృతి హాసన్ స్క్రీన్‌ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చింది. ముందు ముందు మా ఇద్దరి కాంబో ను సలార్ లో ప్రేక్షకులు చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారంటూ చెప్పుకొచ్చింది. తాజాగా పుట్టిన రోజు జరుపుకున్న శృతి హాసన్ ఆ సందర్బంగా ఒక మీడియా సంస్థకు బర్త్‌ డే స్పెషల్‌ ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ ఇంటర్వ్యూలో పలు విషయాలను శృతి హాసన్‌ వెళ్లడించింది. ప్రభాస్‌ తో వర్క్ ఎక్స్‌ పీరియన్స్ గురించి శృతి హాసన్‌ ప్రత్యేకంగా వ్యాఖ్యలు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.

ప్రభాస్‌ తో వర్క్‌ చేసే ప్రతి ఒక్క హీరోయిన్‌ కూడా ఆయనతో మళ్లీ మళ్లీ వర్క్‌ చేయాలని కోరుకోవడం చాలా కామన్‌ విషయం. శృతి హాసన్‌ కూడా ప్రభాస్ తో వర్క్ ను ఎంజాయ్ చేస్తున్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రభాస్‌ నిజంగా డార్లింగ్‌ అంటూ శృతి హాసన్ వ్యాఖ్యలు చేసింది. అతడు చాలా మంచి వ్యక్తి. అతడు తన చుట్టు ఉన్న వారు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆయన ప్రతి ఒక్కరితో కూడా సరదాగా మాట్లాడతాడు. మేము నటించిన ఈ సినిమాను మీకు చూపించేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానంటూ శృతి హాసన్ చెప్పుకొచ్చింది. శృతి హాసన్‌ సలార్ సినిమాలో ఆద్య పాత్రలో కనిపించబోతున్నట్లుగా పుట్టిన రోజు సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు ఒక పోస్టర్‌ ను విడుదల చేడం జరిగింది. ప్రభాస్‌ మరియు శృతి హాసన్‌ లు మొదటి సారి కలిసి నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

సినిమా ను ఇదే ఏడాదిలో ద్వి తీయార్థంలో విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు. సలార్‌ సినిమా ను కేజీఎఫ్ కు మించిన భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నట్లుగా దర్శకుడు ప్రశాంత్ నీల్‌ చెబుతున్నాడు. రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లను కూడా సలార్‌ దక్కించుకుంటుందనే నమ్మకం ను వ్యక్తం చేస్తున్నారు. సలార్‌ సూపర్ హిట్ అయితే శృతి హాసన్‌ పాన్ ఇండియా రేంజ్ లో మరింతగా పెద్ద సినిమాల ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య తో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక సినిమా ను శృతి హాసన్‌ చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమా పై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి.