Begin typing your search above and press return to search.

సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుండి మరో హీరో

By:  Tupaki Desk   |   25 Oct 2020 11:37 AM GMT
సూపర్‌ స్టార్‌ ఫ్యామిలీ నుండి మరో హీరో
X
టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ కృష్ణ ఫ్యామిలీ నుండి ఇప్పటికే మహేష్‌ బాబు నుండి మొదలుకుని గల్లా అశోక్‌ వరకు చాలా మంది హీరోలుగా పరిచయం అయ్యారు.. మరికొందరు పరిచయంకు సిద్దం అవుతున్నారు. కృష్ణ రెండవ భార్య అయిన దివంగత విజయ నిర్మల సోదరుడి మనవడు అయిన శరన్‌ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం శరన్‌ నటుడిగా శిక్షణ పొందుతున్నాడు. డాన్స్‌ మరియు యాక్షన్‌ సన్నివేశాల కోసం శరన్‌ ట్రైనింగ్‌ అవుతున్నాడు. ఇప్పటికే ఈయన కోసం కథ మరియు టెక్నీషియన్స్‌ రెడీ అయ్యారట.

శరన్‌ హీరోగా పరిచయం కాబోతున్న సినిమాకు రామ్‌ చంద్ర వట్టికుటి దర్శకత్వం వహించబోతున్నాడు. శ్రీలత వెంకట్‌ ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన అతి త్వరలోనే రాబోతుంది. చదువు పూర్తి చేసుకున్న శరన్‌ హీరోగా పరిచయం అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడట. కృష్ణ కు మనవడు వరుస అయ్యే శరన్‌ కు ఆయన కుటుంబ అభిమానులు స్వాగతం పలుకుతారేమో చూడాలి. కృష్ణ సహాయ సహకారం ఉంటుందా.. మహేష్‌ బాబు ఈయన్ను ప్రమోట్‌ చేస్తాడా అనేది కూడా చూడాలి.