Begin typing your search above and press return to search.

షాకింగ్‌: రామోజీ ఫిలింసిటీకి గండి కొట్టే మ‌రో ఫిలింసిటీ?

By:  Tupaki Desk   |   20 Sep 2020 4:30 AM GMT
షాకింగ్‌: రామోజీ ఫిలింసిటీకి గండి కొట్టే మ‌రో ఫిలింసిటీ?
X
ప్ర‌పంచీక‌ర‌ణ పెను మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టింది. ప్ర‌పంచ దేశాల్లో ఎక్క‌డ ఏ ఉత్ప‌త్తిని అయినా అమ్ముకోవ‌చ్చు లేదా కొనుక్కోవ‌చ్చ‌. ఇక ఇదే క్ర‌మంలో ప్ర‌పంచ‌దేశాలు ఏ దేశంలో అయినా ప‌రిమితుల న‌డుమ‌ పెట్టుబ‌డులు పెట్టొచ్చు. ఇది ఫిలింఇండ‌స్ట్రీల‌కు వ‌ర్తిస్తుంది.

ఇక భార‌త‌దేశంలో నంబ‌ర్ ఫిలింసిటీ ఏది? భారీ ఆదాయం తెచ్చే ఫిలింస్టూడియోలు ఎక్క‌డ ఉన్నాయి? అంటే .. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీ ఆ త‌ర్వాత‌ ముంబైలోని ఫిల్మ్ సిటీ దేశంలో రెండు అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోలు క‌లిగిన ఫిలిం సిటీలుగా వెలిగిపోతున్నాయి. అయితే వీట‌న్నిటినీ కొట్టే మ‌రో ఫిలింసిటీని నిర్మించ‌నున్నారా? అంటే అవున‌నే స‌మాచారం.

భారతదేశపు అతిపెద్ద చలనచిత్ర నగరాన్ని (ఫిలింసిటీ) నిర్మించేందుకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ పిలుపునివ్వ‌డం సంచ‌ల‌న‌మైంది. రాబోవు కొన్నేళ్ల‌లో దేశంలోని అతిపెద్ద చలనచిత్ర నగరం ఉత్తర ప్రదేశ్ లోని నోయిడాలోని గౌతమ్ బుద్ధ నగర్ లో ఏర్పాటు చేయాల‌న్న‌ది ప్లాన్. సీఎం యోగి ఆదిత్యనాథ్ ఒక భారీ ఫిల్మ్ స్టూడియోను రూపొందించాలని నిశ్చయించుకున్నారు. ఇది దేశవ్యాప్తంగా ఫిలింమేక‌ర్స్ కి అన్నిర‌కాల సౌక‌ర్యాల‌తో అవసరాలను తీర్చేలా రూపొందిస్తారు. అలాగే దీనివ‌ల్ల స్థానిక‌ ప్రజలకు ఉపాధిని కూడా కల్పించే వీలుంటుంది.

తాజాగా ఓ వీడియో కాన్ఫరెన్స్ లో నోయిడా.. గ్రేటర్ నోయిడా .. యమునా ఎక్స్ ‌ప్రెస్‌వే ప్రాంతాల్లో స్టూడియోను ఏర్పాటు చేయడానికి సరైన ప్రదేశం కోసం స్కౌట్ చేయాలని ఆదిత్యనాథ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మీడియాతో సంభాషించిన సిఎం దేశానికి మంచి ఫిల్మ్ సిటీ అవసరమని యుపి బాధ్యత తీసుకోవడానికి సిద్ధంగా ఉందని అన్నారు. ఆయ‌న నిర్ణ‌యంపై ప్ర‌ఖ్యాత న‌టి కంగ‌న ర‌నౌత్ హ‌ర్షం వ్య‌క్తం చేసిన సంగ‌తి విధిత‌మే.