బిబి కి హోస్టింగ్ గా మరో స్టార్ హీరోయిన్

Tue Nov 23 2021 23:00:02 GMT+0530 (IST)

Another Star Heroine As Hosting For BB

ఇండియాలో బిగ్ బాస్ కు దక్కుతున్న ఆధరన అంతా ఇంత కాదు. ఉత్తరాది ప్రేక్షకులను పుష్కర కాలంకు పైగా సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ ఎంటర్ టైన్ చేస్తూనే ఉంది. ఇక సౌత్ లో తమిళం మరియు తెలుగు ల్లో బిగ్ బాస్ అయిదవ సీజన్ లు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. రెండవ సీజన్ కు నాని హోస్టింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత మూడవ నాల్గవ మరియు ఇప్పుడు జరుగుతున్న అయిదవ సీజన్ కు కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాడు.. వ్యవహరిస్తున్నాడు. కాని తమిళంలో మాత్రం వరుసగా అయిదు సీజన్ లకు కూడా కమల్ హాసన్ హోస్ట్ గా చేస్తున్నాడు. ఆయన హౌస్ ను నడిపించే తీరు అందరిని ఆకట్టుకుంటుంది. అందుకే తమిళ బిగ్ బాస్ కు మంచి రేటింగ్ దక్కుతోంది.తెలుగు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున విదేశీ షెడ్యూల్స్ కు వెళ్లిన రెండు సార్లు ఆయన స్థానంను ఇద్దరు హీరోయిన్స్ భర్తీ చేశారు. ఒక సారి రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించి అందరి దృష్టిని ఆకర్షించి మంచి రేటింగ్ ను దక్కించుకోగా.. మరో సారి సమంత కూడా హోస్ట్ గా వ్యవహరించింది. నాగార్జున ప్లేస్ లో ఒక్క వీకెండ్ కోసం వచ్చిన సమంత కూడా భారీ రేటింగ్ ను దక్కించుకుంది. తమిళ బిగ్ బాస్ కు ఇప్పటి వరకు అలాంటి అవసరం రాలేదు. కాని మొదటి సారి వచ్చే వారం కమల్ కాకుండా మరో హోస్ట్ బిగ్ బాస్ స్టేజ్ పై కనిపించబోతున్నారు. ఆయన కరోనా బారిన పడ్డ నేపథ్యంలో ఆయన కూతురు శృతి హాసన్ బిబి ని హోస్ట్ చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఇప్పటికే ఆమె అందుకు సంబంధించిన ట్రైనింగ్ తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మాటలు మాత్రమే కాకుండా చేస్టలు మరియు బాడీ లాంగ్వేజ్ ఇలా అన్ని విషయాల్లో కూడా తండ్రిని అనుకరించేందుకు శృతి హాసన్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్ తమిళం సీజన్ 5 కోసం శృతి హాసన్ హోస్ట్ అనే విషయం ప్రస్తుతం తమిళ మీడియా వర్గాల్లో ప్రముఖంగా వార్తలు వస్తున్నాయి. శృతి హాసన్ నుండి లేదా బిగ్ బాస్ తమిళ టీమ్ నుండి ఇప్పటి వరకు ఆ విషయమై క్లారిటీ లేదు. కమల్ హాసన్ కు వీలు పడని కారణంగా ఆయన కూతురు లేదా మరెవ్వరైనా హోస్టింగ్ చేయాల్సిందే. శృతి హాసన్ హోస్ట్ అంటూ వస్తున్న వార్తలు ఫుల్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది అనేది చూడాలి.