ఆర్‌ఆర్‌ఆర్ కి మరో ప్రతిష్టాత్మక అమెరికన్ అవార్డు

Tue Dec 06 2022 11:42:18 GMT+0530 (India Standard Time)

Another Prestigious American Award For RRR

టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ ఆర్ ఆర్ సినిమా సందడి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సినిమా విడుదల అయ్యి నెలలు గడుస్తూ ఉన్నా కూడా ఏదో ఒక చోట సినిమా స్క్రీనింగ్ అవ్వడం లేదంటే అవార్డును దక్కించుకోవడం చేస్తూ ఉంది. తన తదుపరి సినిమా పనులు వదిలేసి మరీ రాజమౌళి అమెరికాలో ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.తాజాగా అమెరికన్ ప్రతిష్టాత్మక అవార్డును ఆర్ ఆర్ ఆర్ సొంతం చేసుకుంది. జక్కన్న యూనిట్ సభ్యులు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ స్పాట్ లైట్ అవార్డును గెలుచుకుంది.

ఈ అవార్డును వచ్చే ఏడాది ఫిబ్రవరి 24వ తారీకు ప్రధానం చేయబోతున్నట్లుగా నిర్వాహకులు ప్రకటించారు.

ఒక వైపు రాజమౌళి ఆస్కార్ అవార్డు యొక్క నామినేషన్స్ కోసం ప్రయత్నాలు చేస్తూ ఉండగా మరో వైపు ఇలా పలు విదేశీ అవార్డులు రావడం తెలుగు ప్రేక్షకులకు ఆనందంను కలిగిస్తూ ఉంది. సోషల్ మీడియాలో రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆర్ ఆర్ ఆర్ సినిమా సాధిస్తున్న అవార్డులను గురించి చర్చించుకుంటూ పొంగి పోతున్నారు.

ఇన్ని అవార్డులు మరియు హాలీవుడ్ మీడియా యొక్క ప్రశంసలు చూస్తూ ఉంటే కచ్చితంగా ఈ సినిమా కు ఆస్కార్ నామినేషన్స్ దక్కడం మాత్రమే కాకుండా ఆస్కార్ అవార్డ్ కూడా దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ అంతా ధీమాగా ఉన్నారు.

సోషల్ మీడియాలో రెగ్యులర్ గా ఆర్ ఆర్ ఆర్ గురించిన ప్రచారం జరుగుతూ ప్రపంచ వ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. ఆస్కార్ నామినేషన్ కోసం భారీగా ఖర్చు చేస్తున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.