చరణ్-శంకర్ ప్రాజెక్ట్ లో మరో పాన్ ఇండియా స్టార్

Sun May 09 2021 17:00:40 GMT+0530 (IST)

Another Pan India star in the Charan-Shankar project

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ `ఆర్ ఆర్ ఆర్` లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ తర్వాత చరణ్ రేంజు వేరే లెవల్ కి చేరనుంది. రాజమౌళి `మగధీర`తో 100 కోట్ల క్లబ్ లో చేరిన చరణ్ ఇప్పుడు అదే దర్శకుడితో మినిమంగా ఆర్.ఆర్.ఆర్ తో 500 కోట్ల క్లబ్ స్టార్ అవ్వడం ఖాయమని అంచనా. పరాజయాలు లేని దర్శకుడితో చరణ్ ప్రయత్నం అంచనాల్ని క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్ తదుపరి ప్రాజెక్ట్ విషయంలో కూడా అంతే జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ తో చరణ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ వార్త ప్రచారంలోకి వచ్చిన నాటి నుంచే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి. అదీ జక్కన్న ప్రాజెక్ట్ తర్వాత శంకర్ పేరు తెరపైకి రావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. శంకర్ చిత్రంలో చరణ్ ఎలా కనిపించనున్నాడు? చరణ్ క్యారెక్టర్ ని శంకర్ ఎలా డిజైన్ చేయబోతున్నాడు? ఎంచుకున్న పాయింట్ ఎలాంటిది? వంటి అంశాలు అభిమానుల్లో ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం టాలీవుడ్ సహా కోలీవుడ్ మీడియాలో ఇది హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఓ ఆసక్తికర అప్టేడ్ వెలుగులోకి వచ్చింది.

ఇందులో ఓ కీలక పాత్రకు పాన్ ఇండియా స్టార్ సుదీప్ ను తీసుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో సైతం సుదీప్ దీనిపై సానుకూలంగా స్పందించడం విశేషం. శంకర్- చరణ్ టీమ్ తో చర్చలు జరుపుతున్నట్లు తెలిపాడు. మరి ఈ చర్చలు గనుక సఫలమైతే శంకర్ -చరణ్ ద్వయానికి సుదీప్ బిగ్ అస్సెట్ అనే చెప్పాలి. తెలుగు- కన్నడ - హిందీ భాషల్లో సుదీప్ క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అతడు టాలీవుడ్ శాండల్వుడ్ లో క్రేజీ స్టార్ గా ఖ్యాతికెక్కాడు. ఇప్పటికే ` సైరా నరసింహారెడ్డి` సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటించిన సంగతి తెలిసిందే. చెర్రీ-శంకర్ మూవీలోనూ అతడి పాత్రకు ప్రాధాన్యత ఉంటుందని అంచనా వేస్తున్నారు.