Begin typing your search above and press return to search.

తెలుగు ప్రేక్షకులకోసం మరో ఓటిటి..!

By:  Tupaki Desk   |   17 Jun 2021 7:30 AM GMT
తెలుగు ప్రేక్షకులకోసం మరో ఓటిటి..!
X
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో కరోనా దెబ్బకు ఇప్పటివరకు ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. కరోనాకు ముందు థియేటర్స్ మాత్రమే మంచి అనుభూతిని కలిగిస్తాయని.. ఎంచక్కా ఫ్యామిలీతో థియేటర్లకు వెళ్లి సినిమాలు ఎంజాయ్ చేయొచ్చు.. అనే ఆలోచనలకి కరోనా బ్రేక్ వేసేసింది. దాదాపు ఏడాదిన్నర కాలంగా తెరకెక్కుతున్న చిన్న - మీడియం బడ్జెట్ సినిమాలకు ఓటిటిలే దిక్కు అయిపోయాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే.. ఇప్పట్లో సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యేలా లేవు. అలాగే సినిమా షూటింగ్స్ నిలిచిపోయి మేకర్స్ కూడా ఎవరిళ్లకు వారే అంకితం అయిపోయారు.

ఇలాంటి తరుణంలో సినీ ప్రేక్షకులకు.. సామాన్య జనాలకు వినోదం పంచాలంటే కేవలం ఓటిటిలే అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి కరోనా వచ్చినప్పటి నుండి ఓటిటిలకు ప్రాధాన్యత పెరిగిపోయింది. జనాలు కూడా లాక్డౌన్ సమయంలో పూర్తిగా ఓటిటిలకే అలవాటు పడిపోయారు. అందుకే ఇప్పుడు థియేటర్స్ లో సినిమాలు రిలీజ్ చేసినా కరోనా భయంతో జనాలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓటిటిలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు డిమాండ్ పెరగడంతో కొత్తగా ఓటిటిలు ప్రారంభం అవుతున్నాయి. తాజాగా తెలుగులో మరో కొత్త ఓటిటి సేవలు ప్రారంభం కాబోతున్నాయి.

ఆల్రెడీ తెలుగు కంటెంట్ అందించేందుకు నెట్ ఫ్లిక్స్.. అమెజాన్.. హాట్ స్టార్.. ఆహా.. జీ5.. స్పార్క్ లాంటి ఓటిటిలు ఉన్నప్పటికీ తాజాగా మరో ప్రముఖ ఓటిటి తెలుగు కంటెంట్ అందించేందుకు సిద్ధం అవుతోంది. సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్స్ ఇండియా తన వీడియో స్ట్రీమింగ్ సర్వీసులను 'సోనీ లైవ్' ఓటిటి ద్వారా ప్రారంభించనుంది. ఇటీవలే 'సోనీ లైవ్' కోసం తెలుగు కంటెంట్ హెడ్‌గా శ్రీధర్ రెడ్డి కొమల్లాను నియమించింది. టాలీవుడ్ ఆయనను మధుర శ్రీధర్ రెడ్డిగా పిలుస్తుంటారు. ప్రస్తుతం సోనీ లైవ్ తెలుగు కంటెంట్ హెడ్ గా మధుర శ్రీధర్ రెడ్డి ఓటిటిని ఎలా ప్రేక్షకుల రీచ్ చేయాలి.. తెలుగు ప్రాంతాలలో ఎలా దీన్ని విస్తరింపజేయాలి అనే ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపాడు. ఇకపై సోనీ లైవ్ లో కూడా తెలుగు సినిమాలు నేరుగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం రిలీజ్ గురించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సినిమాలకు ఓటిటిలు మంచి ప్లాట్ ఫామ్ అందించే అవకాశం ఉంది. చూడాలి మరి జనాలు కొత్త ఓటిటిలను ఎలా రిసీవ్ చేసుకుంటారో..!