Begin typing your search above and press return to search.

డిజిట‌ల్ లో మ‌రో అమ్మ‌డు బిగ్ ట్రీట్

By:  Tupaki Desk   |   14 Nov 2019 7:15 AM GMT
డిజిట‌ల్ లో మ‌రో అమ్మ‌డు బిగ్ ట్రీట్
X
భ‌విష్య‌త్ డిజిట‌ల్ దే అన‌డంలో సందేహం లేదు. మునుముందు చిన్న సినిమాలు.. టీవీ కార్య‌క్ర‌మాల స్పేస్ ని వెబ్ సిరీస్ లు ఆక్ర‌మించ‌నున్నాయ‌న్న‌ది తాజా సర్వే రిపోర్ట్. అందుకే ప్ర‌స్తుతం స్టార్లు అంతా అటువైపు అడుగులు వేస్తున్నారు. సినిమాకి ఏమాత్రం త‌గ్గ‌ని ట్రీట్ అక్క‌డ దొరుకుతుండ‌డంతో వెబ్ సిరీస్ ల‌కు ఆద‌ర‌ణ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఇప్ప‌టికే ప‌లువురు అగ్ర హీరోలు స‌హా క‌థానాయిక‌లు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తూ బిజీగా ఉన్నారు. రెజీన‌-నిహారిక‌-రాధిక ఆప్టే- ప్రియ‌మ‌ణి వీళ్లంతా ఇప్ప‌టికే న‌టించేశారు. స‌మంత‌-అమ‌లాపాల్ స‌హా ప‌లువురు క‌థానాయిక‌లు ఈ రంగంలో అడుగులు వేస్తున్నారు.

ఈ భామ‌ల‌ త‌ర‌హాలోనే ఆపిల్ బ్యూటీ హ‌న్సిక కూడా కొత్త‌గా ఈ రంగంలో ప్ర‌వేశిస్తోంది. తమిళంలో నాలుగు చిత్రాలతో బిజీగా ఉన్న ఈ అమ్మ‌డు తెలుగులో తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్ అనే చిత్రంలో న‌టించింది. ఈ సినిమా రిలీజ్ ప్ర‌చారంలో భాగంగా వెబ్ సిరీస్ సంగ‌తిని రివీల్ చేసింది. ``ప్ర‌స్తుతం భాగ‌మ‌తి ఫేం దర్శకుడు అశోక్ తెరకెక్కించనున్న అమెజాన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. ఆ వెబ్ సిరీస్ లో నాపాత్ర చాలా ఎగ్జ‌యిట్ చేయ‌బోతోంది. నాలుగు రోజుల చిత్రీక‌ర‌ణ మిన‌హా మిగ‌తా షూట్ అంతా పూర్త‌యింది`` అని తెలిపింది. ఈ వెబ్ సిరీస్ లో హ‌న్సిక కాస్తంత ఘాటైన స‌న్నివేశాల్లో న‌టించే ఆస్కారం ఉందిట‌.

అస‌లు వెబ్ సిరీస్ అంటేనే ఘాటైన వ్య‌వ‌హారం. టాప్ బ్యూటీస్ అంతా అందుకు ఏమాత్రం సంశ‌యించుకుండా న‌టిస్తున్నారు. కియ‌రా అద్వాణీ- రాధిక ఆప్టే లాంటి భామ‌లు ఇప్ప‌టికే ప్రూవ్ చేశారు. మ‌రి అమ‌లాపాల్ - హ‌న్సిక ఈ కేట‌గిరీలోనే అద‌ర‌గొట్ట‌డం ఖాయం అని భావిస్తున్నారు.