పవన్ తేజ్ కి మెగా మద్దతు ఇక లాంఛనమే!

Fri Oct 07 2022 05:00:01 GMT+0530 (India Standard Time)

Another Hero From Mega Family

మెగా ఫ్యామిలీ నుండి ఎంత మంది హీరోలొచ్చినా స్వాగతించడానికి అభిమానులెప్పుడు సిద్దంగా ఉంటారు. మెగాస్టార్ నాటిన వృక్షం బలంగా ఉన్నంత కాలం ఆ రకమైన ఇబ్బంది ఉండదు. ఇప్పటికే మెగా ఇమేజ్ తో పవన్ కళ్యాణ్.. అల్లు అర్జున్.. రామ్ చరణ్.. వరుణ్ తేజ్.. సాయి తేజ్.. వైష్ణవ్ తేజ్.. అల్లు శిరీష్.. కళ్యాణ్ దేవ్ లాంటి వారు లాచ్ అయ్యారు.వారంతా సక్సెస్ అయి మెగా ఇమేజ్ తో మార్కెట్ లో చెలామణి అవుతున్నారు. అలాగే నాగబాబు కుమార్తె  నిహారిక కొణిదెల వెండి తెరపై మెరుస్తుంది. మెగా ఇమేజ్ తో ఎంట్రీ ఇచ్చినా...అటుపై వాళ్లపడిన కష్టం..శ్రమ ఇవన్నీ తోవడ్వడంతోనే నేడు పెద్ద స్టార్లుగా అవతరించారు. లేదంటే?  మెగాస్టార్ వెన్నుతట్టి ప్రోత్సహించినా..అభిమానులు ఆదరించకపోతే ఆ స్థాయికి చేరుకునే వారు కాదు.

పవన్.. బన్నీ.. చరణ్ లు తమదైన రీతిలో సూపర్ స్టార్లుగా మారగా.. మరికొందరు  మెగా బ్రాండ్  తో దూసుకుపోతున్నారు. తాజాగా మరో మెగా వారసుడ్ని చిరంజీవి ప్రోత్సహించడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అతను ఎంట్రీ ఇచ్చాడు. కానీ మెగా బాండింగ్ అంతగా వినియోగించుకోలేదు. ఇప్పుడిప్పుడే మెగా ఫ్యామిలీతో ర్యాప్ పెరగడంతో సీన్ లోకి పెద్దాయన్ని లాగాలాని ట్రై చేస్తున్నట్లు కనిపిస్తుంది.

అతను ఎవరో కాదు పవన్ తేజ్ కొణిదేల. ఇతను ఇప్పటికే 'ఆచార్య'లో స్టూడెంట్ గూండా పాత్రను పోషించాడు.  అలాగే గాడ్ ఫాదర్‌లో కూడా గిరిజన కుర్రాడి పాత్రను పోషించాడు.కీలకమైన పోరాట సన్నివేశంలో మెగాస్టార్ తో కలిసి కనిపించాడు. అంతకు ముందు మెగాస్టార్ కంబ్యాక్ మూవీ ' ఖైదీ నంబర్ 150' లో నటించాడు.

ఇలా వరుసగా పవన్ చిరు సినిమాల్లో నటిస్తూ అతనికి మరింత దగ్గరవుతున్నాడు. ఇటీవలే చిరంజీవి దంపతులు పవన్ తేజ్ వివాహానికి జంటగా హాజరైన సంగతి తెలిసిందే. నూతన వధువరూలను ఆశీర్వదించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఇంతకీ చిరంజీవి కి పవన్ తేజ్ ఏమవుతాడు. అంటే చిరుకి  తండ్రి వైపు నుండి దగ్గర బంధువని తెలుస్తోంది.

మెగా ఇమేజ్ తో సంబంధం లేకుండా తొలుత పవన్ తేజ్ కొణిదెల హీరోగా ఓ సినిమా చేసాడు. అప్పుడే అతను మెతగా ఫ్యామిలీ బంధువని తెలిసింది. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మెగా ఇమేజ్ ని వినియోగించు కుని ఇండస్ర్టీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడే ప్లాన్ లో ఉన్నట్లు  తెలుస్తోంది.

 ఈ క్రమంలోనే  మెగా ఫ్యామిలీకి మరింత క్లోజ్ అవుతున్నట్లు కనిపిస్తుంది. సినిమాలంటే ఫ్యాషన్.. కమిట్ మెంట్..డెడికేషన్ ఉన్న వారిని ప్రోత్సహించడంలో మెగాస్టార్ ఎప్పుడు ముందుంటారు. చరణ్..పవన్..బన్నీ..వరుణ్ లాంటి యంగ్ స్టార్స్ కూడా పవన్ తేజ్ గురించి ఓ ట్వీట్ వేస్తే  ఇంకా వేగంగా దూసుకుపోయే ఛాన్స ఉంది.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.