మహేష్ బాబు మరో విదేశీ పర్యటన

Tue Dec 06 2022 13:05:13 GMT+0530 (India Standard Time)

Another Foreign Tour Of Mahesh Babu

ఒక వైపు మహేష్ బాబు అభిమానులు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో మహేష్ బాబు షూటింగ్ కు హాజరు కాకపోవడం అభిమానులను ఆవేదనకు గురి చేస్తోంది. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి వార్తలు వస్తున్నాయి. మొదటి సంవత్సరం లో కరోనా వల్ల షూటింగ్ ప్రారంభం అవ్వలేదు.ఆ తర్వాత సర్కారు వారి పాట సినిమా కారణంగా షూటింగ్ ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది అనుకుంటూ ఉండగా మహేష్ బాబు మాతృమూర్తి మృతి చెందారు. ఆ సమయంలో మహేష్ బాబు తీవ్ర మనోవేదనకు గురి అయ్యారు. ఆమె మరణం నుండి కోలుకునేందుకు విదేశీ పర్యటనకు మహేష్ బాబు వెళ్లారు.

విదేశాల నుండి తిరిగి వచ్చి షూటింగ్ లో పాల్గొనేందుకు సిద్ధం అయిన సమయంలో కృష్ణ మృతి చెందడంతో మళ్లీ షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది.

తండ్రి మరణం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న మహేష్ బాబు దుబాయిలో పర్యటించేందుకు సిద్ధం అయ్యారు అనే వార్తలు వస్తున్నాయి.

ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ రెండవ వారంలో షూటింగ్ ను పునః ప్రారంభించాల్సి ఉంది. కానీ పూజా హెగ్డే డేట్లు లేకపోవడంతో షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది. ఇదే సమయంలో మహేష్ బాబు విదేశీ పర్యటన పెట్టుకున్నాడు అంటూ సమాచారం అందుతోంది.

మహేష్ బాబు తో త్రివిక్రమ్ మరియు థమన్ కూడా దుబాయ్ లో మ్యూజిక్ సిట్టింగ్స్ ఉండబోతున్నాయనే వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత కానీ మహేష్ బాబు.. త్రివిక్రమ్ యొక్క సినిమా షూటింగ్ కార్యక్రమాలు పునః ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. గ్యాప్ వచ్చిన ప్రతి సారి కూడా త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో మార్పులు చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.