Begin typing your search above and press return to search.

దిల్ రాజుకు మునుపటి జడ్జిమెంట్ లేదట!

By:  Tupaki Desk   |   13 Feb 2020 7:15 AM GMT
దిల్ రాజుకు మునుపటి జడ్జిమెంట్ లేదట!
X
స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు జడ్జిమెంట్ పై చాలామందికి నమ్మకం ఉంది. ఆ నమ్మకం ఒక్కరోజులో ఏమీ రాలేదు. ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్లు.. బ్లాక్ బస్టర్లు ఉన్నాయి కాబట్టే ప్రేక్షకులు ఆయన జడ్జిమెంట్ ను నమ్మడం మొదలుపెట్టారు. కొంతమంది ఆడియన్స్ జస్ట్ 'దిల్ రాజు' పేరు చూసి టికెట్ కొంటారు. అందులో ఏమీ అతిశయోక్తి లేదు. కానీ స్లోగా ఆయన ఇమేజ్ కూడా దెబ్బతింటోంది. రాజు గారు ప్రమోషన్లలో చెప్పినదానికి ఆయన సినిమాల్లో ఉన్న కంటెంట్ కు మధ్య తేడా ఉండడంతో ప్రేక్షకులు ఆయనను లైట్ తీసుకోవడం మొదలు పెట్టారు.

'శ్రీనివాస కళ్యాణం'.. 'లవర్'.. 'ఇద్దరిలోకం ఒకటే' లాంటి సినిమాలే రాజుగారిపై ఉన్న నమ్మకం సడలిపోవడానికి కారణం. అడపాదడపా 'F2' లాంటి హిట్లు వస్తున్నప్పటికీ రాజుగారి మునుపటి సినిమాల స్థాయి క్వాలిటీ వీటి లో లేదని కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా దిల్ రాజు గారి బ్యానర్ నుండి వచ్చిన 'జాను' కూడా అదే లిస్టులో చేరిపోయేలా ఉంది. ఈ సినిమా గురించి రాజుగారు ఎంతో చెప్పినప్పటికీ ఫలితం మాత్రం పూర్తిగా రివర్స్ లో ఉంది. దీంతో మరోసారి దిల్ రాజు జడ్జిమెంట్ పై సందేహాలు తలెత్తుతున్నాయి.

ఇది ఎవరో కొందరు వ్యక్తం చేసే అభిప్రాయమేనా? లేదా ప్రేక్షకుల్లో ఎక్కువ మంది అలా భావిస్తున్నారా అనే ఉద్దేశంతో మేము ఒక పోల్ నిర్వహించాము. ఈ పోల్ లో "సినిమాల విషయంలో నిర్మాత దిల్ రాజు జడ్జిమెంట్ తప్పుతోందా?" అనే ప్రశ్న వేసినప్పుడు 72% మంది పాఠకులు 'అవును' అంటూ ఓటు వేశారు. 22% మంది రీడర్స్ 'జడ్జిమెంట్ తప్పడం లేదు' అంటూ రాజుగారికి మద్దతుగా నిలిచారు. 6% మాత్రం మాకు తెలియదు అంటూ అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం.

ఇది రాజుగారు ఒకసారి తప్పనిసరిగా గమనించాల్సిన అంశం. ఎందుకంటే పాఠకులు తమ అభిప్రాయాన్ని ఎప్పుడూ కుండబద్దలు కొట్టేలా చెప్తారు. మెజారిటీ ప్రేక్షకులు రాజుగారి కథల జడ్జిమెంట్ లో లోపం కనిపిస్తుందని అంటున్నారు అంటే ఆయన ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనేది ఆత్మ పరిశీలన చేసుకోవాలి. లేకపోతే కాలం గడిచే కొద్ది ఈ ఫ్లాపుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది.