పవన్ సినిమాలోకి మరో బాలీవుడ్ స్టార్!

Tue Feb 23 2021 16:40:37 GMT+0530 (IST)

Another Bollywood star in Pawan movie

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రెండు సినిమాల షూటింగులతో బిజీగా ఉన్నాడు. ఓవైపు అయ్యప్పనుమ్ కోషియం సినిమా చేస్తూనే మరోవైపు క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియడిక్ ఫిల్మ్ చేస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఫస్ట్ టైం నటిస్తున్నాడు పవన్. 27వ సినిమాగా రూపొందుతున్న ఈ హిస్టోరికల్ మూవీ పై ఇప్పటికే పవర్ స్టార్ అభిమానులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ తో చేయబోయే స్క్రిప్ట్ సెట్ పనులను ఇదివరకే పూర్తి చేసిన క్రిష్.. ఇటీవలే షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ వకీల్ సాబ్ కంప్లీట్ చేసేసాడు. ఆ సినిమా ఏప్రిల్ 9న థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం తెరకెక్కుతున్న క్రిష్ సినిమాను భారీ బడ్జెట్ తో ఏఎం రత్నం నిర్మిస్తున్నారు.ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ కథానాయిక కాగా బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీన్ ఫర్నేండెజ్ మరో కీలకపాత్రలో నటిస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ నటించనున్నట్లు తెలుస్తుంది. యాక్టర్ అర్జున్ రాంపాల్ పవన్ సినిమాలో కీలక రోల్ ప్లే చేయనున్నట్లు టాక్. ఇటీవలే డైరెక్టర్ అర్జున్ రాంపాల్ ను కలిసి డిస్కషన్ చేశారట. అయితే ఈ సినిమా పట్ల అర్జున్ సానుకూలంగా స్పందించాడట. అన్ని ఓకే అయితే గనక అర్జున్ త్వరలోనే పవన్ షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకు మొదటి నుండి 'విరూపాక్ష' అనే టైటిల్ బాగా వినిపించింది. కానీ మేకర్స్ దృష్టిలో వీరమల్లు హరహరమహాదేవ్ పరిశీలనలో ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. అయితే ఈ రెండిట్లో కూడా డైరెక్టర్ వీరమల్లుకే ఖరారు చేసే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి బాలీవుడ్ స్టార్లను లైన్ లో పెడుతున్నారంటే సినిమాను మల్టీలాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తారేమో!