సల్మాన్ కు షాక్: ట్విట్టర్ లో ‘బాయ్ కాట్ ఆంటీమ్’ ట్రెండింగ్

Sun Nov 28 2021 07:00:02 GMT+0530 (IST)

Another Bollywood Film Falls Prays For Boycott

బాలీవుడ్ కండల వీరుడు స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మూవీ ‘ఆంటీమ్: ది ఫైనల్ ట్రూత్’.. ఈ సినిమా నవంబర్ 26న థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు మహేష్ మంజ్రేకర్ దర్శకత్వం వహించారు. విద్యుత్ జమాల్ శృతిహాసన్ నటించిన ‘పవర్’ తర్వాత మహేష్ మంజ్రేకర్ తీసిన రెండో చిత్రమిది.అయితే సల్మాన్ ఖాన్ పోలీస్ పాత్రలో నటిస్తుండడంతో విడుదలకు ముందు ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే ఈ సినిమా నిన్న విడుదల కాగా.. ప్రేక్షకులు విమర్శకుల నుంచి బ్యాడ్ టాక్ తెచ్చుకుంటోందీ చిత్రం.

అంతేకాకుండా సోషల్ మీడియాలో ఈ సినిమాపై ‘బాయ్ కాట్ ఆంటీమ్’ అని ట్రెండ్ కూడా అవుతోంది. ఈ చిత్రంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక సల్మాన్ అభిమానులు మాత్రం సినిమాను ఎంజాయ్ చేస్తుంటే.. అత్యధికంగా నెటిజన్లు బహిష్కరిస్తున్నారు. ప్రతీ నిమిషానికి ట్వీట్లు పెరుగుతూనే ఉన్నాయి.

అయితే ఇందుకు కారణం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అని తెలుస్తోంది. ఎందుకంటే సుశాంత్ మరణం కేసులో సల్మాన్ ఖాన్ పేరు వినిపించడం ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కారణంతోనే ఆంటీమ్ సినిమాను బాయ్ కాట్ చేస్తున్నట్టు సమాచారం.

సల్మాన్ కు దేశం పట్ల శ్రద్ధ లేదని.. అతడిది విరుద్ధమైన భావజాలంగా చూపిస్తూ ట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. సినిమా విడుదలకు ముందు కూడా ఇది వివాదాస్పదంగా మారింది.