Begin typing your search above and press return to search.

ఐతే 'అన్నాత్తే' ఇప్పట్లో లేనట్లేనా?

By:  Tupaki Desk   |   21 Jan 2021 6:47 AM GMT
ఐతే అన్నాత్తే ఇప్పట్లో లేనట్లేనా?
X
సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా 'అన్నాత్తే'. ఈ సినిమా చిత్రీకరణ ఇటీవలే పునః ప్రారంభించారు. షూటింగ్‌ ను ఫిబ్రవరిలో పూర్తి చేసి మార్చి లేదా ఏప్రిల్‌ లో సినిమాను విడుదల చేయాలనుకున్నారు. కాని షూటింగ్ సమయంలో రజినీకాంత్‌ అనారోగ్య సమస్యలు తలెత్తడంతో షూటింగ్ నిలిచి పోయింది. షూటింగ్ కు బ్రేక్ ఇచ్చిన రజినీకాంత్ విదేశాలకు వెళ్లే ఆలోచనల్లో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది. రజినీకాంత్‌ విదేశాలకు వెళ్లుతున్న నేపథ్యంలో మళ్లీ వచ్చేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది. కనుక ఈ గ్యాప్‌ లో మరో సినిమాను చేయాలని శివ నిర్ణయించుకున్నాడట.

శివ ఇప్పటికే తన తదుపరి సినిమాను సూర్యతో చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే అన్నాత్తే సినిమా షూటింగ్‌ కు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో సూర్య సినిమాను మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. సూర్య హీరోగా రూపొందిన సినిమా పూర్తి అయిన వెంటనే శివ దర్శకత్వంలో సినిమాను పట్టాలెక్కించబోతున్నట్లుగా తెలుస్తోంది. సూర్య సినిమా షూటింగ్‌ ను మొదలు పెడుతున్న నేపథ్యంలో అన్నాత్తే ఆలస్యం అవుతుందని అంటున్నారు.