సుశాంత్ మరణం తర్వాత ఆమె మాత్రమే వెళ్లిందట

Sat Jul 11 2020 18:30:18 GMT+0530 (IST)

She was the only one went after Sushant's death

సుశాంత్ మరణం తర్వాత ఆయన అభిమానులు ఇంకా నెటిజన్స్ సోషల్ మీడియాలో పలువురిని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. సల్మాన్ ఖాన్ నుండి ఆలియా భట్ వరకు ఎంతో మందిని టార్గెట్ చేసి ట్రోల్స్ చేస్తున్నారు. ప్రస్తుత ప్రియురాలు రియా చక్రవర్తి ఇంకా మాజీ ప్రియురాలు అంకిత లోంఖడేలు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతున్నారు. నెటిజన్స్ ట్రోల్స్ తట్టుకోలేక పోలువురు తమ సోషల్ మీడియా అకౌంట్స్ ను బ్లాక్ చేసిన విషయం తెల్సిందే.సుశాంత్ మరణించిన కొన్ని గంటలకే ఆయన మాజీ ప్రియురాలు అయిన అంకిత లోంఖడే తన సోషల్ మీడియా అకౌంట్ ను డీ యాక్టివేట్ చేసింది. ప్రస్తుతం ఆమెను ప్రేమిస్తున్న వ్యక్తిని కూడా నెటిజన్స్ విడిచి పెట్టలేదు. అంకితతో విడిపోయిన తర్వాత సుశాంత్ ఆమె సంతోషంగా ఉండాలనుకుంటున్నట్లుగా పలు సందర్బాల్లో చెప్పడంతో పాటు సోషల్ మీడియాలో కూడా పేర్కొన్నాడు. ఇద్దరు బ్రేకప్ తర్వాత స్నేహితులుగా మెలిగారంటూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ అన్నాడు.

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బాలీవుడ్ నుండి బీహార్ వచ్చి మమ్ములను పరామర్శించిన వారు ఒకే ఒక్కరు అంకిత లోంఖడే. ఆమె పట్ల మాకు ఎలాంటి కోపం లేదు. మమ్ములను ఓదార్చేందుకు ఆమె పాట్నాకు రావడం జరిగింది. సుశాంత్ తో ఆమె విడిపోయిన తర్వాత అతడి కుటుంబంతో కూడా చాలా సన్నిహితంగా ఉందని దీంతో అర్థం అవుతుంది. కనుక సుశాంత్ మరణంలో అంకితను ట్రోల్స్ చేయాల్సిన అవసరం లేదంటూ కొందరు అభిప్రాయ పడుతున్నారు.