అంజలి మేకోవర్ హీటెక్కిస్తోందే

Sun May 19 2019 14:20:03 GMT+0530 (IST)

Anjali make over for Lisa 3D Movie

`సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగింటి సీతమ్మగా పాపులరైంది అంజలి. అంతకుముందు షాపింగ్ మాల్.. జర్నీ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలతో చక్కని నటిగా గుర్తింపు తెచ్చుకున్న అంజలికి తెలుగు స్ట్రెయిట్ సినిమా `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` ఇచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు.ఈ చిత్రంలో వెంకీ సరసన అంజలి నటన మైమరిపించింది. దశాబ్ధం క్రితమే ఫోటో.. ప్రేమలేఖ రాశా అనే స్ట్రెయిట్ తెలుగు సినిమాలతో పరిచయమైనా వాటితో రాని గుర్తింపు.. డబ్బింగ్ సినిమాలతోనే తెచ్చుకుంది. మిడిల్ లో ఈ అమ్మడి కెరీర్ గ్యాప్ గురించి తెలిసిందే. ఐదేళ్ల క్రితం `గీతాంజలి` (2014) అనే హారర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. మధ్యలో కొన్ని ఫ్లాపులు.. వ్యక్తిగత జీవితంలో వివాదాలు కెరీర్ కి బ్రేక్ వేశాయి. ఇప్పటికి తిరిగి సర్ధుకుంది. సౌత్ లో అంజలి కెరీర్ కేమీ డోఖా లేదు. ఇటు తెలుగులో అడపాదడపా నటిస్తూనే.. అటు తమిళంలో రెగ్యులర్ గా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమిళ హీరో జైతో ఈ భామ ప్రేమలో ఉందని.. గుట్టు చప్పుడు కాకుండా  సహజీవనం చేస్తున్నారని తమిళ మీడియాలో వార్తలొచ్చాయి.ప్రస్తుతం అంజలి నటించిన హారర్ చిత్రం `లీసా 3డి` ఈనెల 24న థియేటర్లలోకి వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ఐమ్యాక్స్ లో 3డి ట్రైలర్ ని ప్రదర్శించారు. ట్రైలర్ వేడుకలో అంజలి సహా నిర్మాత సురేష్ కొండేటి.. దర్శకుడు విశ్వనాథ్ మూవీ ఆర్టిస్టుల సంఘం మాజీ అధ్యక్షుడు శివాజీరాజా తదితరులు పాల్గొన్నారు. ఈ వేదికపై అంజలి మాట్లాడుతూ .. ``లీసా నా  కెరీర్ లో ఇంపార్టెంట్ మూవీ. తొలిసారి 3డిలో ప్రయత్నించాను. ఇందులో పాటలు బావుంటాయి.. ట్రైలర్ ఆకట్టుకుంది. హారర్ జోనర్ చాలామందికి ఇష్టమైన జోనర్. అందరికీ నచ్చుతుందనే భావిస్తున్నాను. తెలుగులో షాపింగ్ మాల్.. జర్నీ లాంటి చిత్రాల్ని రిలీజ్ చేసిన సురేష్ కొండేటి రిలీజ్ చేస్తున్నారు. రాజు విశ్వనాథం దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆయనకు ది బెస్ట్ డెబ్యూ సినిమా అవ్వాలి. అందరూ థియేటర్లలో చూసి ప్రోత్సహించండి`` అన్నారు.

ఆసక్తికరంగా ఈ వేదికపై అంజలి లుక్ గురించి ఆసక్తికర చర్చ సాగింది. అంజలిలో ఛామ్.. సెక్సప్పీల్ మునుపటితో పోలిస్తే రెట్టింపైంది. తీర్చిదిద్దిన బార్బీ బొమ్మలా .. నవలా నాయికను తలపిస్తోంది అంటూ ప్రశంసలు కురిశాయి. ఇక ఈ తరహా మేకోవర్ కోసం తెలుగమ్మాయి అంజలి చాలానే జాగ్రత్తలు తీసుకుంటోందిట. రెగ్యులర్ గా జిమ్.. యోగాతో పాటు ఆహార నియమాల్ని పాటిస్తూ అంజలి తన లుక్ ని కాపాడుకుంటోంది. లీసా ప్రమోషన్స్ లో వైట్ డిజైనర్ డ్రెస్ లో అంజలి యువతరాన్ని ఆకర్షించింది.