విమానంలా గాల్లో తేలిన తెలుగమ్మాయ్

Mon Jul 26 2021 12:28:58 GMT+0530 (IST)

Telugu Actress Anjali floated in the air like a plane

యోగాలో ప్రయోగాలతో సెలబ్రిటీలు ఆకట్టుకుంటున్నారు. యోగ విద్యలో ఇప్పుడు అడ్వాన్స్ డ్ క్రియేటివిటీ కనిపిస్తోంది. అనుష్క.. సమంత.. తమన్నా.. జాన్వీ.. మలైకా.. సంజన ఎవరికి వారు యోగాలో అనుభవజ్ఞులయ్యాక కొత్త అసనాలను క్రియేట్ చేస్తున్నారు.  ఇప్పుడు అదే బాటలో తెలుగమ్మాయి అంజలి యోగాలో ప్రయోగాలతో ఆకర్షిస్తోంది.ఇన్ స్టాగ్రామ్ లో తన తాజా పోస్ట్ లతో అంజలి అందరికీ షాకిస్తోంది. తాజాగా తనదైన శైలిలో వైమానిక యోగా నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఇది చాలా క్లిష్టమైన యోగా.. కానీ చాలా సులువుగా చేసేస్తోంది. అలా ఊయల సాయంతో గాల్లో తేలిన అంజలి తలకిందులుగా వంగి కనిపిస్తోంది. ``నేను వంగి ఉన్నాను.. కాబట్టి నేను తెగి కిందపడను`` అని అంజలి ఈ స్నాప్ లకు శీర్షికను జోడించారు.

కెరీర్ సంగతి చూస్తే.. ఇటీవల పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ చిత్రంలో నలుగురిలో ఒక నటిగా కీలక పాత్రలో కనిపించింది. తదుపరి అంజలి అగ్ర నిర్మాతలతో ఓ రెండు తెలుగు చిత్రాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. మరోవైపు తమిళంలోనూ పలు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల తన స్నేహితుడు జై నుంచి బ్రేకప్ అయ్యారని ప్రచారం సాగిన సంగతి తెలిసినదే.