నెట్టింట హల్ చల్ చేస్తున్న అంజలి అరోరా వీడియో!.. కన్నీళ్లు పెట్టుకున్న నటి

Mon Aug 15 2022 09:35:43 GMT+0530 (IST)

Anjali Arora's Viral Video Actress tears

సోషల్ మీడియా ఎంట్రీ ఇచ్చాక బోలెడంత మంది బుల్లి సెలబ్రిటీలు వచ్చేశారు. తమకున్న టాలెంట్ తో అందరికి ఆకర్షించేసే ఇలాంటి సోషల్ సెలబ్రిటీలు.. రియాల్టీ షోలలో పాల్గొనే అవకాశం రావటం.. దాంతో మరింత పాపులార్టీని తెచ్చుకోవటం తెలిసిందే. అలాంటి కోవలోకే వస్తారు అంజలి అరోరా. చిట్టి వీడియోలతో స్టార్లుగా మారిన వారిలో అంజలి ఒకరు. కచ్చా బాదమ్ పాటకు ఆమె చేసిన రీల్ తో అందరిని ఆకర్షించారు. అనంతరం కంగనా రౌనత్ నిర్వహించిన లాకప్ షోలో పాల్గొన్న ఆమె.. తాను హోటల్ రిసెప్షనిస్టుగా పని చేస్తున్న వేళ..ఒక వీకెండ్ లో రూ.5వేల కోసం తాను చేసిన పని గురించి అందులో చెప్పి సంచలనంగా మారారు.రియాల్టీ షోలలో చెప్పే మాటలు కొన్నిసార్లు స్క్రిప్టుకు తగ్గట్లు ఉంటాయన్న మాట వినిపిస్తూ ఉంటుంది. లేకపోతే.. తన జీవితంలో జరిగినట్లుగా చెప్పిన ఉదంతంలో దారుణమైన అంశాలు ఉండటం.. అలాంటివి షోలో భాగంగా చెప్పినప్పటికీ.. అలాంటివి వారి వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేసే వీలు ఉంటుంది కదా? అలాంటివి మరెందుకు చెబుతారెందుకు? అన్న ప్రశ్నల్ని పక్కన పెడితే.. తాజాగా ఆమె పేరు మీద ఒక వీడియో వైరల్ అవుతోంది.

ఈ వీడియోలో ఉన్న అమ్మాయి అంజలి అరోరా లా కనిపించటం.. మరో వ్యక్తితో అత్యంత సన్నిహితంగా వ్యవహరించటం.. అభ్యంతరకర రీతిలో ఉన్న ఆ వీడియో ఇప్పుడు షాకింగ్ గా మారింది. ఈ వీడియో గురించి కొందరు యూట్యూబర్లు ఆమెను నేరుగా అడగటం.చేస్తున్నారని.. ఇలాంటి వాటిని తట్టుకునే శక్తి తనకు లేదని కన్నీళ్లు పెట్టుకున్నారు.

ప్రస్తుతం ఈ టాపిక్ హల్ చల్ చేస్తోంది. . ఆమె ఫీల్ కావటం జరిగాయి. ఈ మధ్యన ఈ వైరల్ వీడియో మీద వస్తున్న వ్యాఖ్యలపై తాజాగా అంజలి అరోరా రియాక్టు అయ్యారు. ఒక వ్యక్తితో అత్యంత సన్నిహితంగా మెలిగినట్లుగా కనిపిస్తున్న వీడియో తనది కాదని.. అదో ఫేక్ వీడియోగా ఆమె వెల్లడించారు. ఎవరు క్రియేట్ చేశారో? ఎందుకు చేశారో తెలీదంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

అసలు ఆ వీడియో తనది కాదని.. తనకు సంబంధం లేని వీడియోకు తన పేరును చేర్చారన్న ఆమె.. అసలు ఎందుకిలా చేస్తున్నారో అర్థం కావట్లేదన్నారు. తన పేరు మీద వైరల్ అవుతున్న వీడియో పుణ్యమా అని.. గతంలో తనను మెచ్చుకునే వారు సైతం తిట్టి పోస్తున్నారంటూ వాపోయింది.

తనకూ ఒక ఫ్యామిలీ ఉందని.. తమ ఇంట్లో వాళ్లు కూడా వీడియోలు చూస్తారన్న ఆలోచన లేకుండా ఇలాంటివి చేయటం దారుణమని వాపోయింది. కేవలం యూట్యూబ్ వ్యూస్ కోసమే ఇలాంటివి చేస్తున్నారంటూ భోరుమంది. అయితే.. తనకు ఇలాంటివి తట్టుకునే శక్తి లేదని పేర్కొంది. ఆమెకు సంబంధించిన వీడియో.. దానికి ఆమె రియాక్టు అయిన తీరుతో అంజలి అరోరా ఇప్పుడు మరింత రచ్చగా ఈ ఇష్యూ మారింది.