Begin typing your search above and press return to search.

తేజ స‌ర్ మ‌ళ్లీ ఆఫ‌ర్ ఇస్తారనా?

By:  Tupaki Desk   |   1 April 2020 6:45 AM GMT
తేజ స‌ర్ మ‌ళ్లీ ఆఫ‌ర్ ఇస్తారనా?
X
సోష‌ల్ మీడియా మ‌ర్చిపోయిన హీరోయిన్ల‌ను క్లాసిక్ న‌టీమ‌ణుల్ని కూడా వెలుగులోకి తెస్తోంది. ఇక ఆ కోవ‌లోనే ఇటీవ‌ల ఎంద‌రో తిరిగి వెండితెర బుల్లితెర ఆఫ‌ర్లు అందుకుంటూ రీఇంట్ర‌డ్యూస్ అయిపోయారు. వెట‌ర‌న్స్ ఎంద‌రో ఇండ‌స్ట్రీలో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టులుగా అవ‌కాశాలు అందిపుచ్చుకున్నారు. ఇక ఈ కోవ‌లోనే మ‌రో ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్టే క‌నిపిస్తోంది ఇక్క‌డ క‌నిపిస్త‌న్న అనిత వ్య‌వ‌హారం చూస్తుంటే.

తేజ డిస్క‌వ‌రీగా ఈ అమ్మ‌డు సుప‌రిచితం. అంత‌కుముందు హిందీ టీవీ సీరియ‌ళ్లు చేసుకునే అనిత హ‌స‌నందానీని పిలిచి ఉద‌య్ కిర‌ణ్ `నువ్వు నేను`లో అవ‌కాశం ఇచ్చారు తేజ‌. ఉద‌య్ లాంటి హ్యాండ్స‌మ్ హీరో స‌ర‌స‌న అవ‌కాశం అందుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత మ‌రోసారి అత‌డి స‌ర‌స‌న శ్రీ‌రామ్ అనే యాక్ష‌న్ చిత్రంలోనూ న‌టించింది. టాలీవుడ్ లో ప‌లు ఆఫ‌ర్లు అందుకున్నా ఇక్క‌డ స్టార్ హీరోయిన్ అవ్వాల‌న్న ఆశ మాత్రం నెర‌వేర‌లేదు. అప్ప‌ట్లో ఉద‌య్ మ‌ర‌ణం స‌మ‌యంలో ఎంతో క‌ల‌త‌కు గురైన ఈ అమ్మ‌డు అది ఊహించ‌లేక‌పోయాన‌ని నివ్వెర పోయింది.

ఇక‌పోతే ఇటీవ‌లి కాలంలో బాలాజీ టెలీ ఫిలింస్ అధినేత్రి ఏక్తా క‌పూర్ తో స్నేహం చేయ‌డంతో ఉన్న‌ట్టుండి అనిత‌కు హిందీ టీవీ ప‌రిశ్ర‌మ‌లో అవకాశాల‌కు కొద‌వే లేకుండా పోయింది. ప్ర‌స్తుతం నాగిన్ 4లో ప్ర‌ధాన పాత్ర పోషిస్తోంది. `న‌చ్ బ‌ళియే` సీజ‌న్ 9లోనూ అనిత హొయ‌లు వేడెక్కిస్తున్నాయ్. అలాగే తాను ప్రేమించిన కార్పొరెట్ ఉద్యోగి రోహిత్ రెడ్డిని పెళ్లాడి సెటిలైన‌ప్ప‌టి నుంచి అనిత త‌న లైఫ్ స్టైల్ ప‌రంగా ఎన్నో మార్పులు చేసింది. ఇక పెళ్ల‌యితే కొంద‌రు త‌గ్గుతారు కానీ.. అలా అయ్యాక ఈ అమ్మ‌డు చెల‌రేగుతున్న తీరును ఇండ‌స్ట్రీ నిశితంగా గ‌మ‌నిస్తోంది. ఇక ఇటీవ‌ల బికినీ ఫోటోలు.. స్విమ్ సూట్ వ్య‌వ‌హార‌ల‌పై కుర్ర‌కారు అదే ప‌నిగా ముచ్చ‌టించుకుంటున్నారు. ఇక ఈ కోవ‌లోనే తాజాగా అదిరిపోయే ఒంపుసొంపుల వ‌య్యారాల్ని ఎర వేస్తూ అనిత ఇస్తున్న గ్లామ‌ర్ షో వెర్రెక్కిస్తోంది. ఈ ఫోటోలు చూశాక‌.. ఇలా అయితే తేజ స‌ర్ పిలిచి మ‌రీ మ‌ళ్లీ అవ‌కాశ‌మిచ్చేస్తారేమో! అంటూ సెటైర్లు వేస్తున్నారు. అన్న‌ట్టు వ‌రుస‌గా రెండు సినిమాలు ప్ర‌క‌టించేసిన తేజ వాటిలో ఏదో ఒక చిన్న ఆఫ‌ర్ అయినా ఇస్తారంటారా? అందుకోస‌మే క‌దా ఈ వేషాల‌న్నీ!!