మురుగా-రజనీ ఫిలిం..మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్

Sun Dec 09 2018 14:04:57 GMT+0530 (IST)

సూపర్ స్టార్ రజనీకాంత్ ఈమధ్య సినిమాల విషయంలో జోరు పెంచిన విషయం తెలిసిందే.  'కాలా' రిలీజ్ కాగానే కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో 'పెట్టా' మొదలు పెట్టాడు.  ఈమధ్యే '2.0' రిలీజ్ అయింది.  'పెట్టా' తమిళనాట సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది.  ఈ సినిమా రిలీజ్ కు ముందే మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ఇప్పుడు జోరుగా సాగుతోందట. మురుగదాస్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ను మురుగదాస్ ఎంచుకున్నాడట.  అనిరుధ్ గతంలో మురుగా-విజయ్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'కత్తి' సినిమాకు సంగీతం అందించాడు. మరోవైపు రజనీకాంత్ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించడం కూడా ఇది రెండో సారి.  కార్తిక్ సుబ్బరాజ్ - రజనీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'పెట్టా' కు మొదటి సారి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలయిన రెండు సింగిల్స్ చార్ట్ బస్టర్స్ అయ్యాయి.  దీంతో 'పెట్టా' మ్యూజిక్ తో సంచలనం సృష్టిస్తాడనే అంచనాలు ఉన్నాయి.  ఈ ఊపులోనే మరోసారి సూపర్ స్టార్ సినిమాకు సంగీతం అందించే అవకాశం రావడం విశేషం.

రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రజనీ ముఖ్యమంత్రి గా కనిపిస్తాడని కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది.  ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తారట. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మార్చ్ నుండి ప్రారభించడానికి ప్లాన్ చేస్తున్నారట. మురుగదాస్ రీసెంట్ గా 'సర్కార్' తో సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దీంతో మురుగ-రజనీ కాంబో పై భారీ అంచనాలు నెలకొన్నాయి.