ఎన్టీఆర్30 : ఓ అరబిక్ కుత్తు ప్లాన్..!

Wed May 25 2022 08:00:01 GMT+0530 (IST)

Anirudh Song Plan in NTR30

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. వీరిద్దరి కాంబో ఇప్పటికే పట్టాలెక్కాల్సి ఉన్నా కూడా కరోనా.. ఆర్ ఆర్ ఆర్ వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది. జనతా గ్యారేజ్ తర్వాత రాబోతున్న వీరిద్దరి కాంబో మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే కొరటాల శివ ఆచార్య సినిమా తో నిరాశ పర్చడం వల్ల ఎన్టీఆర్ 30 పై ఒకింత ఆందోళన ఫ్యాన్స్ లో కనిపిస్తుంది.ఆచార్య సినిమా విషయంలో కొరటాల శివ తప్పు ఏమీ లేదు అన్నట్లుగా కొందరు నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కొరటాల శివకు స్వేచ్చ ఇస్తే తప్పకుండా ఎన్టీఆర్ 30 సినిమాను హిట్ చేస్తాడని వారు నమ్ముతున్నారు.

అపజయం ఎరగని కొరటాల శివ కు ఆచార్య ఎదురు దెబ్బ తగిలింది. మళ్లీ ఆయన తన సత్తా చాటుకోవడం కోసం ఖచ్చితంగా ఎన్టీఆర్ 30 కి కొత్తగా వస్తాడని అంతా నమ్ముతున్నారు.

ఇక ఎన్టీఆర్ 30 సినిమా కు అనిరుథ్ సంగీతం అనే విషయం తెల్సిందే. తమిళ మ్యూజిక్ సెన్షేషన్ అనిరుథ్ రవిచంద్రన్ ఖచ్చితంగా ఎన్టీఆర్ కోసం అద్బుతమైన మాస్ బీట్స్ ను ఇస్తాడని అభిమానులు నమ్ముతున్నారు. తమిళనాట అనిరుథ్ సంగీతంకు ఏ స్థాయిలో ఆధరణ ఉందో అందరికి తెల్సిందే. అనిరుథ్ రవిచంద్రన్ ప్రతి సినిమా లో కూడా ఒక కుత్తు సాంగ్ తో అదరగొట్టేస్తున్నాడు.

తమిళ సినిమాల్లో కుత్తు సాంగ్ అంటే ప్రత్యేకమైన మాస్ గీతం అని అర్థం. మాస్ సాంగ్స్ ను తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరిస్తారు. అందుకే ఇటీవల బీస్ట్ లో అరబిక్ కుత్తు ను ఎలా అయితే అదరగొట్టేశాడో అలాంటి మాస్ బీట్ విభిన్నమైన కుత్తు సాంగ్ ను ఎన్టీఆర్ సినిమా కోసం రెడీ చేస్తున్నాడట. ఒక మాస్ బీట్ తప్పకుండా అది మాస్ ఆడియన్స్ ను డాన్స్ చేయిస్తుందని అంటున్నారు.

అనిరుథ్ ఇప్పటికే తెలుగు లో కొన్ని సినిమాలు చేశాడు. కాని అవి కమర్షియల్ గా హిట్ అవ్వక పోవడంతో ఇప్పటి వరకు ఆయన ఆఫర్ల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. ఎన్టీఆర్ 30 తర్వాత ఖచ్చితంగా అనిరుథ్ కెరీర్ టాలీవుడ్ లో కూడా మారిపోతుంది. అక్కడ ఇక్కడ ఫుల్ బిజీ కంపోజర్ గా నిలుస్తాడంటూ మీడియా వర్గాల వారు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.