మహేష్ నిర్మాతకు మరో దెబ్బ!

Thu Oct 10 2019 07:00:02 GMT+0530 (IST)

నిర్మాతకి ఒక ఫ్లాప్ వస్తేనే తట్టుకోలేరు. అలాంటిది వరుస అపజయలోస్తే ఇక సినిమాలకు పులిస్టాప్ పెట్టక తప్పదు అనే ఆలోచనకి వచ్చేసయడం సహజమే. అయితే నిర్మాత అనిల్ సుంకర మాత్రం ఎన్ని అపజయాలు వచ్చినా కుంగిపోకుండా సినిమాలు నిర్మిస్తున్నాడు. ఇటివలే ఈయన నిర్మించిన 'రాజు గాడు' - 'కిరాక్ పార్టీ' -'సీత' సినిమాలు భారీ నష్టాలు తెచ్చాయి.ఇప్పుడు ఈయన ఫ్లాపు లిస్టులోకి 'చాణక్య' కూడా చేరిపోయింది. ఎంతో నమ్మకం పెట్టుకొని మంచి బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు ఓపినింగ్స్ కూడా పెద్దగా రాలేదు. మొదటి షోకే ఫ్లాప్ అనే టాక్ తెచ్చుకోవడం రిలీజ్ రోజు రెండో ఆటకే సినిమా డౌన్ అయింది. ఈ సినిమా కంటే ముందు గోపీచంద్ కి వరుస ఫ్లాపులు ఉండటంతో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా పెద్దగా జరగలేదు. శాటిలైట్ రైట్స్ కి కూడా ఆశించిన అమౌంట్ రాలేదని సమాచారం.

ఇక ఇలా వరుసా అపజయాలు అందుకుంటూ సినిమాలను నిర్మిస్తున్న ఈ నిర్మాతకి ఇప్పుడు ఒకే ఒక్క ఆశ 'సరిలేరు నీకెవ్వరు'. ఈ సినిమాతో మళ్ళీ భారీ కలెక్షన్స్ అందుకొని సక్సెస్ ఫుల్ నిర్మాత అనిపించుకోవాలని చూస్తున్నాడు. మరి మహేష్ సినిమాతో అయినా అనిల్ సుంకర నిర్మాతగా సక్సెస్ కొట్టాలని ఆశిద్దాం.