Begin typing your search above and press return to search.

బ‌డ్జెట్లో మూడో వంతు హీరో-ద‌ర్శ‌కుల‌కే!

By:  Tupaki Desk   |   20 Nov 2019 5:30 PM GMT
బ‌డ్జెట్లో మూడో వంతు హీరో-ద‌ర్శ‌కుల‌కే!
X
స్టార్ హీరోలు - స్టార్ డైరెక్ట‌ర్ల‌ పారితోషికాలు ఆల్వేస్ హాట్ టాపిక్. మ‌న‌కు ఉన్న డ‌జ‌ను మంది స్టార్ హీరోలు.. అంతే సంఖ్య‌లో ఉన్న స్టార్ డైరెక్ట‌ర్ల‌కు భారీగా పారితోషికాలు చెల్లించాల్సి ఉంటుంద‌న్న‌ది వాస్త‌వం. పెద్ద సినిమాల‌కు100-120 కోట్ల బ‌డ్జెట్ అనుకుంటే మూడు వాటాలుగా చూసినా.. అందులో మూడో వంతు కేవ‌లం హీరో- ద‌ర్శ‌కుడి ఖాతాలోకే వెళ్లిపోయే స‌న్నివేశం ఉంది. హీరోని చూసే టిక్కెట్టు తెగుతుంది.. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ రేంజును బ‌ట్టి కూడా జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తున్నారు. అందుకే ఆ ఇద్ద‌రిదే మెజారిటీ షేర్ గా మారింది. డిమాండ్ స‌ప్ల‌య్ సూత్రం ఆధారంగా అంత పెద్ద మొత్తాల్ని చెల్లించేందుకు నిర్మాత‌లు ముందుకు వ‌స్తుండ‌డంతో ఈ ఆట అలా సాఫీగానే సాగిపోతోంది. అయితే చివ‌ర్లో సినిమా తేడా కొట్టిన‌ప్పుడే ఈ భారీ బాదుడుపై ఆవేద‌న వ్య‌క్తం చేస్తుంటారు నిర్మాత‌లు.

అదంతా అలా ఉంటే సంక్రాంతి బ‌రిలో దిగుతున్న భారీ సినిమాల‌కు హీరో- ద‌ర్శ‌కుడు ఏక‌ మొత్తంగా పుచ్చుకునే పారితోషికాలు షాకిస్తున్నాయ‌న్న నివేదిక తాజాగా అందింది. బ‌న్ని-త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి.. మ‌హేష్- అనీల్ రావిపూడి కాంబినేష‌న్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` చిత్రానికి భారీగా పారితోషికాలు అందుకోవ‌డం ఇటీవ‌ల చర్చ‌కు వ‌చ్చింది. మ‌హేష్ విష‌యంలో పారితోషికం ప్ల‌స్ లాభాల్లో వాటాలు ఏరియా హ‌క్కులు అంటూ లెక్క‌లు చెబుతోంటే.. 100శాతం స‌క్సెస్ రేటు ఉన్న‌ ట్యాలెంటెడ్ అనీల్ రావిపూడికి దాదాపు 10-12 కోట్ల మేర చెల్లిస్తున్నార‌న్న ప్ర‌చారం ఉంది. దీంతో బ‌డ్జెట్లో మూడో వంతు సుమారుగా ఆ ఇద్ద‌రి ఖాతాలోకే ప‌డిపోతుంద‌ని విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. అల వైకుంఠ‌పుర‌ములో చిత్రానికి హీరో-ద‌ర్శ‌కుల‌కు భారీగానే ప్యాకేజ్ ముడుతోంద‌ట‌. బ‌న్నికి రూ.20 నుంచి 25 కోట్ల మేర పారితోషికం అందుతుండ‌గా.. త్రివిక్ర‌మ్ కి న‌రూ.20 కోట్ల వ‌ర‌కూ చెల్లించ‌నున్నార‌ని తెలుస్తోంది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో మూడో వంతు అంటే సుమారు 45-50 కోట్లు ఆ ఇద్ద‌రి పారితోషికాల‌కే వెళ్లిపోతోంద‌ని చెబుతున్నారు. ఇక మిగిలిన‌ది ఇత‌ర బ‌డ్జెట్ కింద లెక్క‌. ఇటీవ‌ల నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కులు మాకే ఇచ్చేయండి అంటూ హీరోలు గుంజేస్తున్నార‌న్న ప్ర‌చారం కొత్త‌గా వేడెక్కిస్తున్న నేప‌థ్యంలో ఈ పారితోషికాల క‌హానీ ఏంటో మింగుడు ప‌డ‌డం లేదు. అల వైకుంట‌పుర‌ములో చిత్రానికి హిందీ డ‌బ్బింగ్ రైట్స్ రూపంలో 19.5కోట్లు ద‌క్క‌గా.. స‌రిలేరు చిత్రానికి సుమారు 15కోట్ల మేర ప‌లికింద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఇక సంక్రాంతి బ‌రిలో క్రేజీగా దిగుతున్న ఈ రెండు చిత్రాల‌కు భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ సాగుతోంది.