మూవీ ప్రమోషన్ లో కొత్త పోకడ.. ఐడియా మీదేనా అనిల్?

Thu Jan 16 2020 10:44:24 GMT+0530 (IST)

Anil Ravipudi Family Thanks to Mahesh babu

సంక్రాంతి బరిలో స్టెయిట్ మూవీగా తొలుత వచ్చిన చిత్రం మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు. మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీసిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళుతున్న వైనం తెలిసిందే. తన సినిమాల్లో సరిలేరునీకెవ్వరు ప్రత్యేకమంటూ మహేశ్ బాబు సైతం చెబుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ వర్క్ ను భారీగా చేస్తున్నారు.ఇప్పటివరకూ ఎప్పుడూ లేని రీతిలో కొత్త తరహాలో ప్రమోషన్ చేసిన తీరు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ప్రమోషన్ వర్క్ కు సంబంధించిన ఐడియా దర్శకుడు అనిల్ రావిపూడిదో.. ఇంకెవరిదో కానీ రానున్న రోజుల్లో ఇదో అలవాటుగా మారుతుందనటంలో సందేహం లేదు. సరిలేరునీకెవ్వరు చిత్రం సక్సెస్ గా దూసుకెళుతున్న వేళ.. దర్శకుడు అనిల్ కుటుంబ సభ్యులు మహేశ్ బాబుకు థ్యాంక్స్ చెప్పటం ఆసక్తికరంగా మారింది.

పండగకు ముందే బ్లాక్ బస్టర్ కా బాప్ ఇచ్చారని.. మహేశ్ కుటుంబానికి సంక్రాంతి శుభాకాంక్షలంటూ చెప్పిన వీడియోను విడుదల చేయటం.. దాన్ని మహేశ్ సతీమణి నమ్రతా తన ఇన్ స్టాలో పోస్ట్ చేయటం గమనార్హం. అంతేకాదు.. మహేశ్ ఈ చిత్రంలో డ్యాన్సులతో ఇరగదీశారని అనిల్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

మహేశ్ తన సినిమాకు అవకాశం ఇచ్చినందుకు అయితే దర్శకుడు థ్యాంక్స్ చెప్పటంలో అర్థముంది.కానీ.. కటుుంబ సభ్యులు మహేశ్ కు థ్యాంక్స్ చెప్పటం ద్వారా ఎలాంటి సందేశాన్ని ఇవ్వదలిచారన్నది క్వశ్చన్. అదే సమయంలో ఈ వీడియోను పోస్టు చేసిన మహేశ్ సతీమణి నమ్రత కూడా రియాక్ట్ అయ్యారు. తమకు బ్లాక్ బస్టర్ సినిమా అందించినందుకు దర్శకుడు అనిల్ కు ధన్యవాదాలు చెప్పారు. ఈ మొత్తాన్ని చూస్తే.. సినిమాకు కీలకమైన మహేశ్ కానీ.. దర్శకుడు అనిల్ కానీ కనిపించకుండా.. వారిద్దరి కుటుంబ సభ్యులు కలిసి ప్రమోట్ చేసిన వీడియో అదిరిందని చెప్పాలి. ఇంతకూ విషయం.. మీకు అర్థమవుతుందా?


వీడియో కోసం క్లిక్ చేయండి