'ఎఫ్ 4' తప్పకుండా ఉంటుంది!

Tue May 24 2022 18:00:34 GMT+0530 (IST)

Anil Ravipudi About F4

కథలో అక్కడక్కడా కామెడీని టచ్ చేస్తూ ప్రేక్షకులను నవ్వించవచ్చు. కానీ కామెడీనే ప్రధానమైన కథగా చేసుకుని సినిమా మొత్తం నడిపించడం .. నవ్వించడం చాలా కష్టం. అలా హాస్యభరితమైన కథలతో సినిమాలను తెరకెక్కించిన దర్శకులలో జంధ్యాల .. ఈవీవీ .. శ్రీను వైట్ల తరువాత స్థానంలో అనిల్ రావిపూడి ఒకరుగా కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'ఎఫ్ 3' ఈ నెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు  రానుంది. ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి - సునీల్ 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్నారు.అనిల్ రావిపూడి మాట్లాడుతూ .. "ఎక్కడికి వెళ్లినా 'ఎఫ్ 4' ఉందా అనే అంతా అడుగుతున్నారు. 'ఎఫ్ 3' సినిమాను నేను ఆశించే రీతిలో ప్రేక్షకులు రిసీవ్ చేసుకుంటే 'ఎఫ్ 3' తప్పకుండా ఉంటుంది. వాళ్లని ఎంటర్టైన్ చేయడం నాకు ఇష్టం కనుక  తప్పకుండా చేస్తాను. మొదటి నుంచి కూడా నా సినిమాల్లో కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఒక రేంజ్ లో ఉంటాయి.  

పటాస్ .. సుప్రీమ్ .. రాజా ది గ్రేట్ సినిమాలు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆ సినిమాల్లో యాక్షన్ సీన్స్ చాలా గొప్పగా ఉంటాయి. యాక్షన్ జోనర్ లో అనుకున్నప్పుడు ఎంతమాత్రం తగ్గకుండానే ఆ సీన్స్ ను డిజైన్ చేసుకున్నాను.

అయితే కామెడీ ఎపిసోడ్స్ డామినేట్ చేయడం వలన యాక్షన్ ఎపిసోడ్స్ ఫోకస్ కాలేదేమో. తప్పకుండా నెక్స్ట్ వచ్చే బాలయ్య సినిమాలో ఒక రేంజ్ లో యాక్షన్ సీన్స్ ఉంటాయి.

ఆ సినిమాకి ఎంటర్టైన్మెంట్ టచ్ ఉంటుంది.. కాకపోతే కొత్త జోనర్లో ఉంటుంది. ఇక 'ఎఫ్ 3' విషయానికి వస్తే .. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను 'ఫలక్ నుమా ప్యాలెస్'లో చేశాము. మధ్యలో పాండమిక్ వలన షూటింగు ఆగిపోయినప్పటికీ ఆ తరువాత అక్కడే కంటిన్యూ  చేశాము. ఇంతవరకూ ఆ ప్యాలెస్ లో ఎక్కువ రోజులు షూటింగు జరుపుకున్న సినిమా ఇదే.

నిజానికి ఆ సీన్స్ ను మైసూర్ ప్యాలెస్ లో చేయాలనుకున్నాము .. కానీ కరోనా వలన కుదరలేదు. దాంతో  ఫలక్ నుమా ప్యాలెస్ లో చేశాము. కాస్ట్ చాలా ఎక్కువే అయినా .. కథకి అవసరం గనుక చేసేశాము. దిల్ రాజుగారు గనుక తట్టుకోగలిగారు. రియల్ లైఫ్ లో చాలామందికి ఎదురయ్యే సంఘటనలనే 'ఎఫ్ 2'లో పెట్టాను. అందువల్లనే ఆ సన్నివేశాలు  చాలామందికి కనెక్ట్ అయ్యాయి" అంటూ చెప్పుకొచ్చాడు.