Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి కోరిక తీరబోతోందా...?

By:  Tupaki Desk   |   24 May 2020 5:30 PM GMT
అనిల్ రావిపూడి కోరిక తీరబోతోందా...?
X
టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్లలో కామెడీ ఎంటర్టైన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. మోస్ట్‌ వాంటెడ్‌ డైరెక్టర్ లిస్టులో చేరిపోయిన అనిల్ రావిపూడి.. కమెర్షియల్ సినిమాలకి తనదైన కామెడీని జోడించి ప్రేక్షకులను మెప్పించడంలో సిద్ధ హస్తుడని చెప్పాలి. 'పటాస్' సినిమాతో మెగాఫోన్ పట్టిన అనిల్ ఆడియన్స్ ని కడుపుబ్బా నవ్వించడంలో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత 'సుప్రీమ్' 'రాజా ది గ్రేట్' సినిమాలతో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నాడు. అదే ఊపులో గతేడాది 'F 2' సినిమాతో భారీ హిట్ సాధించారు. ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ గా వంద కోట్లు వ‌సూలు చేసి బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఇక 2020 ఏడాది ప్రారంభంలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఖాతాలో వేసుకున్నారు.

100 పర్సెంట్ సక్సెస్ రేట్ తో వరుస విజయాలతో దూసుకుపోతూ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి తన హిట్ సినిమా 'F 2'కి సీక్వెల్ గా 'F 3' స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో బాలయ్యతో మరియు మోక్షజ్ఞతో సినిమా చేయాలనే కోరికను వెలిబుచ్చాడు అనిల్ రావిపూడి. ఇప్పటికే బాలయ్య కోసం లైన్ రెడీ చేశానని.. అయితే ఇద్దరికీ డేట్స్ కుదరక ఇప్పటికీ అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చారు అనిల్. వాస్తవానికి 'సుప్రీమ్' సినిమా తర్వాత బాలయ్యతో సినిమా చేయాలని అనిల్ ట్రై చేసాడు. కానీ బాలకృష్ణ కెరీర్లో మైలురాయి 100వ చిత్రాన్ని క్రిష్ జాగర్లమూడి తన్నుకు పోయాడు. దీంతో మరో నందమూరి హీరోని డైరెక్ట్ చేయాలనే ఆశ నిరాశగా మిగిలిపోయింది.

అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం బాలయ్య - అనిల్ రావిపూడి కాంబోలో సినిమా రాబోతోందట. ఇటీవల బాలయ్యకు అనిల్ చెప్పిన స్టోరీ లైన్ నచ్చిందట. దీంతో బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ గా తన కెరీర్లో 107వ చిత్రంగా తెరకెక్కనుంది. బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా సినీ ఇండస్ట్రీలో ఏర్పడిన పరిస్థితుల వలన షూటింగ్ నిలుపుదల చేసుకుంది. కాగా ఈ సినిమా పూర్తైన తర్వాత అనిల్ రావిపూడి - బాలకృష్ణ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈలోపు అనిల్ విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ లతో 'F 3' సినిమా ఫినిష్ చేసుకుంటాడు. మొత్తం మీద అనిల్ రావిపూడి.. బాలయ్య 100వ సినిమాకి ట్రై చేస్తే 107వ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ దొరికిందన్నమాట.