Begin typing your search above and press return to search.

అదరహో అనిపిస్తున్న ఆండ్రియా.. అందాల హాట్ షో!

By:  Tupaki Desk   |   16 Jun 2021 12:30 AM GMT
అదరహో అనిపిస్తున్న ఆండ్రియా.. అందాల హాట్ షో!
X
సౌత్ ఇండియన్ యాక్ట్రెస్ ఆండ్రియా జెరేమియా అందరికి తెలిసే ఉంటుంది. కేవలం నటిగా మాత్రమే కాకుండా ఆండ్రియా ప్లే-బ్యాక్ సింగర్ గా బాగా సుపరిచితం. ఎందుకంటే తమిళ - తెలుగు భాషల్లో నటిగా కంటే ముందే అమ్మడు గాయనిగా ప్రూవ్ చేసుకుంది. తమిళనాడులోనే పుట్టి పెరిగిన ఈ ముప్పై ఐదేళ్ల సోయగం విద్యాభ్యాసం మొత్తం చెన్నైలోనే పూర్తి చేసింది. చిన్నప్పటి నుండే సంగీతం పై మక్కువతో క్లాసికల్ మ్యూజిక్ నేర్చుకుని అలాగే పలు స్టేజి షోలలో కూడా పాల్గొందట ఆండ్రియా. తర్వాత 2006లో ఓ కాఫీ యాడ్ ద్వారా యాక్టింగ్ ప్రారంభించి.. నటిగా 'పచ్చకిలి ముత్తుచారం' సినిమాతో తమిళంలో డెబ్యూ చేసింది.

ఆ తర్వాత డైరెక్టర్ సెల్వరాఘవన్ తెరకెక్కించిన యుగానికి ఒక్కడు సినిమాతో అమ్మడి కెరీర్ ఊపందుకుంది. అలా తమిళంలో యాక్టింగ్ చేస్తూనే సింగింగ్ కూడా కంటిన్యూ చేసింది. తెలుగులో ఆండ్రియా చాలా పాటలు పాడింది. ముఖ్యంగా రాఖీ సినిమాలోని జరజరా.. కింగ్ లో నేను నీ రాజా.. ఇలా ఎక్కువగా డిఎస్పీ మ్యూజిక్ లో పాడింది. మంచి ఫేమ్ కూడా అందుకుంది. కానీ నటిగా మాత్రం తెలుగులో తడాఖా సినిమాతో డెబ్యూ చేసింది. ఈ భామకు తెలుగులో అదే ఫస్ట్ అండ్ లాస్ట్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే ఆ సినిమా తర్వాత డబ్బడ్ సినిమాలతో కనిపించింది. కానీ డైరెక్ట్ తెలుగు ఫిల్మ్ మాత్రం మళ్లీ రాలేదు.

ఇక ఇప్పుడిప్పుడే మళ్లీ బిజీ అవుతుంది ఆండ్రియా. అయితే ఇప్పటికే పలు అఫైర్స్ తో వార్తల్లో నిలిచింది. అవి నిజమేనని కూడా ఒప్పుకుంది. కానీ ఆమె రిలేషన్ షిప్స్ ఒకటి కూడా నిలవలేదు. ఇదిలా ఉండగా.. సినిమాల్లో గ్లామర్ షో చేయడంలో ఈ భామ ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. అందుకే సినిమాల్లో గ్లామరస్ అందాల ఆరబోతతో పాటు అదిరిపోయే ఫోటోషూట్స్ ద్వారా కూడా కుర్రాళ్లకు వినోదం పంచుతుంది. సోషల్ మీడియాలో ఈ వయ్యారి సొగసులకు సూపర్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఆండ్రియా ఓ స్టైలిష్ డ్రెస్ లో హాట్ షో చేసింది. టాప్ టు బాటమ్ బ్లాక్ డ్రెస్ లో వయ్యారి వేడిరేపుతోంది. హాట్ లుక్స్ లో ఆండ్రియాను చూస్తూ ఫ్యాన్స్ అందమైన కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆండ్రియా గ్లామరస్ పిక్ నెట్టింట వైరల్ అవుతోంది.