ఆంధ్రా సిఎం కిడ్నాప్డ్ - తెలంగాణ సీఎం సస్పెక్టెడ్

Thu Dec 03 2015 00:04:26 GMT+0530 (IST)

Andhra CM Kidnapped, Telangana CM Suspected

సినిమాలో సరుకు ఉన్నా లేకపోయినా.. టైటిల్స్ తోనే క్యూరియాసిటీ క్రియేట్ చేయడం రామ్ గోపాల్ వర్మ స్పెషాలిటీ. ఇప్పుడు రీసెంట్ గా అలా ఆసక్తి కలిగించడమే కాదు.. సంచలనాత్మకమైన టైటిల్ ఒకటి కన్ఫాం చేశాడు.సినిమా పేరేంటో తెలుసా. "ఆంధ్రా సిఎం కిడ్నాప్డ్". పేరే వెరైటీగా ఉంది. ఏదో థ్రిల్లర్ తీస్తూ ఉంటాడులే అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు కథ మరొకటి ఉంది. అదేంటంటే.. దీనికి తగిలించిన ట్యాగ్ లైన్. "తెలంగాణ సీఎం సస్పెక్టెడ్" అంటూ ట్యాగ్ లైన్ ఒకటి జోడించాడు. అంటే తన థ్రిల్లర్ కి రాజకీయాలను జోడించాశాడన్న మాట. ఈ సినిమా తీస్తున్నానంటూ.. ట్విట్టర్ లో అధికారికంగానే ప్రకటించాడు వర్మ.

ఇలాంటి వెరైటీ టైటిల్స్ పెట్టడం వర్మకు కొత్తేం కాదు. అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత.. "రెడ్డి గారు పోయారు" అనే టైటిల్ తో సినిమా చేస్తానన్నాడు. ఇది ఏమైందో తెలీదు కానీ... ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులనే టార్గెట్ చేసేశాడు. మధ్యమధ్యలో మధ్యాహ్నం హత్య లాంటి వింత టైటిల్స్ పెట్టి తిట్టించుకునే అలవాటు కూడా ఉంది లెండి. క్రేజీ టైటిల్స్ బాగానే ఉంటాయి కానీ.. వర్మ ఎందుకో కాంట్రవర్సీలకే మొగ్గుతాడు.