Begin typing your search above and press return to search.

నితిన్ సినిమాలో 'టబు' క్యారెక్టర్ చేయబోయేది ఎవరు..??

By:  Tupaki Desk   |   12 Aug 2020 3:45 AM GMT
నితిన్ సినిమాలో టబు క్యారెక్టర్ చేయబోయేది ఎవరు..??
X
బాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ 'అంధాధున్‌' సినిమాను టాలీవుడ్ హీరో నితిన్‌ ప్రధాన పాత్రలో రీమేక్‌ చేస్తున్న సంగతి తెల్సిందే. వెంకటాద్రి ఎక్సప్రెస్ ఫేమ్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా పై ఓ మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రస్తుతం నటీనటుల ఎంపిక దశలో ఉంది. ఇందులో హీరోయిన్‌ విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది.. గ్యాంగ్ లీడర్ ఫేమ్ ప్రియాంక అరుళ్ మోహన్ పేరు బలంగా వినిపిస్తుంది. ఇక హీరో తర్వాత కీలక పాత్ర అయిన టబు పాత్రని ఎవరు పోషిస్తారు..? అనేది ఇంకా తేలని ప్రశ్న. నిజానికి ఒరిజినల్‌ వర్షన్‌లో నటించిన టబు పాత్రకోసం మొదట ఆమెనే సంప్రదించారు. కానీ ఆమె నో చెప్పింది. దాంతో యాంకర్ అనసూయను ఈ పాత్ర కోసం అడిగారట. కానీ ఆమె కూడా నో చెప్పినట్లు తెలుస్తోంది. ఆ తరువాత మరో ఇద్దరు హీరోయిన్లను కూడా ఈ క్యారెక్టర్ కోసం అడగగా వాళ్లు అదే సమాధానం చెప్పారట.

ఇక ప్రస్తుతం చిత్రబృందం హీరోయిన్ నయనతారను ఈ పాత్రకోసం ఒప్పించడానికి ప్రయత్నాలు చేస్తుందని వార్తలొస్తున్నాయి. భారీ పారితోషికం ఇస్తే నయన్ హీరో ఎవరని చూడకుండా సినిమా చేస్తుందని టాక్. తాజాగా ఈ విషయమై చిత్ర యూనిట్‌ సభ్యులు స్పందించారు. ఇప్పటి వరకు అంధాధున్‌ రీమేక్‌ కు సంబంధించి నయనతారతో చర్చలు జరగలేదు. ఆమె పారితోషికం విషయంలో మీడియాలో వస్తున్న వార్తలు నిజం కాదు. అంధాధున్‌ రీమేక్‌ లో టబు పాత్రకు ఆమె అయితే బాగుంటుందని తాము భావించామని ఇంకా సంప్రదించలేదని పేర్కొన్నారట. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం నితిన్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయట. వెంకీ అట్లూరితో రంగ్ దే.. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఒక సినిమా.. కృష్ణ చైతన్య దర్శకత్వంలో పవర్ పేట.. మేర్లపాక గాంధీతో అంధాధున్‌ రీమేక్. పెళ్లి తర్వాత జోరు పెంచనున్నట్లు ఇండస్ట్రీ టాక్. చూడాలి మరి తెలుగు అంధధూన్ సంగతి ఏంటో..!