Begin typing your search above and press return to search.

నువ్వు ఎలిమినేట్ కావాల్సింది కాద‌క్కా!

By:  Tupaki Desk   |   9 July 2018 4:23 AM GMT
నువ్వు ఎలిమినేట్ కావాల్సింది కాద‌క్కా!
X
గుట్టుగా సాగే బిగ్ బాస్ షోకు సంబంధించిన వివ‌రాలు.. కాస్త ముందుగానే బ‌య‌ట‌కు రావ‌టం తెలిసిందే. ఆదివారం ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌న్న విష‌యాన్ని తాజా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ శ్యామ‌ల ముందుగానే సోష‌ల్ మీడియాలో పోస్టు రూపంలో పెట్టేయ‌టం.. ఆ వెంట‌నే డిలీట్ చేయ‌టం తెలిసిందే.

బై బై బిగ్ బాస్.. ఇట్స్ టైమ్ టు ఇషాన్.. బిగ్ బాస్ లో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ శ్యామ‌ల పోస్ట్ చేశారు.ఆ వెంట‌నే బిగ్ బాస్ రూల్స్ గుర్తుకు వ‌చ్చాయో? లేక‌.. త‌న పొర‌పాటున గుర్తించారేమో కానీ శ్యామ‌ల త‌న పోస్టును డిలీట్ చేశారు. అప్ప‌టికే ప‌లువురు స్క్రీన్ షాట్ల రూపంలో షేర్ చేయ‌టంతో ఆమె పోస్టు వైర‌ల్ అయ్యింది. అదే స‌మ‌యంలో.. శ్యామ‌ల ఎలిమినేట్ అవుతుంద‌న్న విష‌యం షో స్టార్ట్ కావ‌టానికి గంట‌ల ముందే లీక్ అయిన‌ట్లు అయ్యింది.

ఇదిలా ఉంటే.. అతి త‌క్కువ ఓట్లు వ‌చ్చిన ముగ్గురిలో శ్యామ‌ల‌ను ఎలిమినేట్ చేసిన తీరును ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఆమెను ఎలిమినేట్ చేయ‌టంపై సోష‌ల్ మీడియాలో వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంది. అస‌లు ఎలిమినేట్ కావాల్సింది మీరు కాద‌క్కా అంటూ కొంద‌రు.. మీకు అన్యాయం జ‌రిగింద‌ని కొంద‌రు.. వేరే వాళ్ల స్థానంలో మిమ్మ‌ల్ని ఎలిమినేట్ చేశార‌ని ఇంకొంద‌రు త‌మ అభిప్రాయాన్ని వ్య‌క్తం చేయ‌టం గ‌మ‌నార్హం.

శ్యామ‌ల‌ను వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా తిరిగి బిగ్ బాస్ హౌస్ లోకి పంపాల‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. నెటిజ‌న్ల అభిప్రాయాల‌కు పెద్ద‌పీట వేసే బిగ్ బాస్‌.. మ‌రి.. శ్యామ‌ల విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి.