టాప్ 3 ఎవరో చెప్పిన రవి.. ఆ పేరు షన్నూ వల్లే నాకు వచ్చింది

Wed Dec 01 2021 19:00:01 GMT+0530 (IST)

Anchor Ravi After Elimination From Biggboss

తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 ముగింపు దశకు వచ్చేసింది. మరో రెండు వారాల్లో సీజన్ ముగియబోతుంది. ఈ సీజన్ విజేత గా రవి నిలిచినా లేకున్నా కూడా ఖచ్చితంగా యాంకర్ రవి సీజన్ 5 టాప్ 5 లో ఉంటాడని అంతా నమ్మకం వ్యక్తం చేశారు. ఆయన్ను ఎవరు ఏం అన్నా కూడా.. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఈ సీజన్ ఫినాలే ఎపిసోడ్ వరకు రవి ఉండేలా చక్కని ఆటతో ఆకట్టుకున్నాడు. కాని అనూహ్యంగా యాంకర్ రవి మరో మూడు వారాలు ఉండగానే ఎలిమినేట్ అవ్వడం అందరికి షాకింగ్ గా మారింది. అది కూడా ప్రియాంక మరియు కాజల్ వంటి వీక్ కంటెస్టెంట్స్ ఉన్న సమయంలో టాప్ 5 కి కూడా యాంకర్ రవి వెళ్లకుండా రవి బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.బయటకు వచ్చిన తర్వాత యాంకర్ రవి సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించాడు. ఆ సందర్బంగా షో లో తనను అంతా కూడా ఇన్ఫ్యూలెన్స్ చేస్తాడు అంటూ వచ్చారు. హోస్ట్ కూడా తనను అలాగే పిలిచాడు. నన్ను షన్నూ ఒక సారి అలా అనడం వల్ల నన్ను అందరూ కూడా అదే మాదిరిగా అనడం జరిగింది. నేను ఎప్పుడు ఎవరిని కూడా ఇన్ఫ్యూలెన్స్ చేసేందుకు ప్రయత్నించలేదు. నా ఆట నేను ఆడుతూ వెళ్లాను. ఎప్పుడు కూడా ఇతరుల ఆటను ప్రభావితం చేసేందుకు నేను చూడలేదు అంటూ క్లారిటీ ఇచ్చాడు. ఆటలో తాను రూల్ ప్రకారం ఆడుతూ వచ్చాను కాని ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టే విధంగా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టలేదు అంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ సీజన్ కు గాను షన్నూ.. సన్నీ మరియు శ్రీరామ చంద్ర లు టాప్ 3 లో ఉంటారని రవి చెప్పుకొచ్చాడు. విజేత ఎవరు అనేది మాత్రం తాను ఇప్పుడే చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు. తన మద్దతు ఎవరికి ఉంటుందో వారికి ఇస్తాను. ఖచ్చితంగా మీరు మీ అభిమాన కంటెస్టెంట్స్ కు ఓట్లు వేస్తూ వారిని సేవ్ చేస్తూ ఉండండి అంటూ సూచించాడు. యాంకర్ రవి అభిమానులు అశ్రద్ద కారణంగానే ఎలిమినేట్ అయ్యాడు. ప్రియాంక ఉండగా ఎలా రవి ఎలిమినేట్ అవుతాడు లే అనుకుని ఆయన అభిమానులు ఓట్ల విషయంలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు అనేది టాక్. అందుకే యాంకర్ రవి ఎలిమినేట్ అయ్యాడు.