భోళా చిరంజీవ తమన్నా.. కీర్తి.. జబర్దస్త్ బ్యూటీ

Wed Nov 24 2021 08:00:01 GMT+0530 (IST)

Anchor Rashmi To Be Next Ratthalu

మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాల జాబితాలో భోళా శంకర్ ఒకటి.  మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా ను మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్నాడు. తమిళ హిట్ మూవీ వేదాళంకు ఈ సినిమా రీమేక్ అనే విషయం తెల్సిందే. వేదాళంకు తెలుగు ప్రేక్షకులకు తగ్గట్లుగా మార్చి చిరంజీవి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరికి నచ్చే విధంగా దర్శకుడు మెహర్ రమేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా లో చిరంజీవికి చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటన వచ్చింది. ఇక షూటింగ్ ప్రారంభోత్సవం రోజున తమన్నా హాజరు అవ్వడంతో ఆమె హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా కన్ఫర్మ్ అయ్యింది. ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఈ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం భోళా శంకర్ సినిమాలో రష్మీ గౌతమ్ ఒక ప్రత్యేక పాటలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆ పాటలో కేవలం రష్మీ గౌతమ్ మాత్రమే కాకుండా మరో హీరోయిన్ కూడా కనిపించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఒక మంచి కాన్సెప్ట్ తో ఆ పాట ఉంటుందని మేకర్స్ నుండి సమాచారం అందుతోంది. భోళా శంకర్ సినిమా ను మాస్ ఆడియన్స్ టార్గెట్ గా రూపొందిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ సినిమాలో చిరంజీవి ని విభిన్నంగా చూపించబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అంతే కాకుండా శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీతో ఒక పాట ను కూడా చిత్రీకరించినట్లుగా తెలుస్తోంది.

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇటీవల చిరంజీవితో ఉన్న ఒక ఫొటోను షేర్ చేశాడు. భోళా శంకర్ తాజా షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తారట. ఈ షెడ్యూల్ పూర్తి అయిన వెంటనే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వబోతున్నాడు. గాడ్ ఫాదర్ షూటింగ్ మద్యలో వదిలేసి చిరంజీవి వచ్చాడు. ఆయన స్వల్ప అనారోగ్యం వల్ల ఆపరేషన్ కూడా చేయించుకున్నాడు. ప్రస్తుతం భోళా శంకర్ లో నటిస్తున్న చిరు ఆ తర్వాత గాడ్ ఫాదర్ లో జాయిన్ అవుతాడు. మొత్తానికి ఈ రెండు సినిమాలు సమాంతరంగా చిరు పూర్తి చేయబోతున్నాడు. ఈ రెండు వచ్చే ఏడాదిలోనే వచ్చే అవకాశాలు ఉన్నాయని మెగా వర్గాల వారు అంటున్నారు.