క్లిక్ క్లిక్ : హాట్ యాంకర్స్ ఊ అంటావా ఊఊ అంటావా

Mon Jan 17 2022 16:00:01 GMT+0530 (IST)

Anchor Rashmi Latest Photo

ఏ ముహూర్తాన పుష్ప సినిమాలో సుకుమార్ ఊ అంటావా ఊఊ అంటావా పాటను పెట్టాడో కాని మారు మ్రోగుతూనే ఉంది. పాట విడుదల అయ్యి రెండు నెలలు కావస్తుంది. అయినా కూడా పాట నెం.1 గా ట్రెండ్ అవుతూనే ఉంది. దేవిశ్రీ ప్రసాద్ పాటకు ప్రాణం పోసినట్లుగా సింగర్ పాడటంతో పాటు సమంత డాన్స్ మరియు హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో మొత్తం పాట స్థాయిని పెంచారు. అందుకే ఇప్పుడు ఎక్కడ చూసినా.. విన్నా కూడా ఊ అంటావా ఊఊ అంటావా అంటూ ఉన్నారు. ఇలాంటి ట్రెండింగ్ సాంగ్స్ ను వదిలి పెట్టకుండా టీవీ షోల్లో డాన్స్ లు చేస్తూ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం సమంత స్థాయి లో కాకున్నా ఆమెను రీచ్ అయ్యేందుకు చాలా మంది ముద్దుగుమ్మలు డాన్స్ చేస్తూ ప్రేక్షకులను పిచ్చెక్కిస్తున్నారు.తాజాగా సంక్రాంతి సంబరాలు ఎక్కడ జరిగినా కూడా ఊ అంటావా ఊఊ అంటావా అనే పాటనే ఎక్కువ వినిపించింది. ఇక సంక్రాంతి సందర్బంగా టెలికాస్ట్ అయిన ప్రత్యేక కార్యక్రమాల్లో కూడా ఊ అంటావా ఊఊ అంటావా పాటనే ఎక్కువగా హైలైట్ అయ్యింది. ఈ పాటకు ఇప్పటికే పలువురు ముద్దుగుమ్మలు డాన్స్ చేశారు. తాజాగా జబర్దస్ యాంకర్ రష్మి గౌతమ్ కూడా ఈ పాటకు డాన్స్ వేసింది. కేవలం డాన్స్ వేయడం మాత్రమే కాకుండా ఈ అమ్మడు సమంత లుక్ ను మ్యాచ్ చేసేందుకు ప్రయత్నించింది. నడుము అందాలను ఎక్స్ పోజ్ చేస్తూ పొట్టి స్కర్ట్ తో ఆకట్టుకునేలా ఉంది.

సమంత తరహా స్టెప్పులు కాకుండా కాస్త విభిన్నంగా ప్రయత్నించిన రష్మి గౌతమ్ ప్రేక్షకులతో ఊఊ అనకుండా ఊ అనిపించింది. కేవలం రష్మి గౌతమ్ మాత్రమే కాకుండా మరో హాట్ యాంకర్ విష్ణు ప్రియ కూడా ఊ అంటావా ఊఊ అంటావా పాటతో రెచ్చి పోయింది. ఈ అమ్మడు సమంతను మించి ఎక్స్ పోజింగ్ చేసిందా అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేశారు. స్కిన్ షో మాత్రమే కాకుండా ఈఅమ్మడి డాన్స్ కూడా సమంతను మ్యాచ్ చేసేలా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి వీరిద్దరి డాన్స్ తో సంక్రాంతి స్పెషల్ షో ల స్థాయి మరో మెట్టు ఎక్కాయి అనడంలో సందేహం లేదు. పెద్ద ఎత్తున అంచనాల నడుమ విడుదల అయిన పుష్ప సినిమా ఈ పాట ఆ పాట వల్ల.. బన్నీ యాక్షన్ వల్ల.. సుకుమార్ టేకింగ్ వల్ల ఇలా ప్రతి ఒక్క కారణంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. సినిమా విజయంలో సమంత ఐటెం సాంగ్ కీలకం అనడంలో సందేహం లేదు.