నన్ను అనేందుకు నువ్వు ఎవరు.. అనసూయ షాకింగ్ కామెంట్స్

Tue Jan 18 2022 05:00:01 GMT+0530 (IST)

Anchor Anasuya shocking comments?

జబర్దస్త్ యాంకర్ అనసూయ ఇద్దరు పిల్లలకు తల్లి అయినా కూడా ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఆమెకు ఆకాశమే హద్దు అన్నట్లుగా బుల్లితెర ప్రేక్షకులు మరియు వెండి తెర ప్రేక్షకులు నీరాజనాలు పడుతున్నారు. అనసూయ ఒక వైపు బుల్లి తెరపై మరో వైపు వెండి తెరపై సందడి చేస్తున్న అనసూయ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఫుల్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ గా దూసుకు పోతుంది. సోషల్ మీడియాలో ఈమెకు ఎంతగా ఫాలోయింగ్ ఉందో అంతే వివాదాలు కూడా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈమె ను రెగ్యులర్ గా నెటిజన్స్ ట్రోల్స్ చేయడం... ఆ ట్రోల్స్ కు ఈమె స్పందించడంతో మీడియాలో ఈమె గురించి ఏదో ఒక విషయమై చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఈమె నెటిజన్ కు ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక నెటిజన్ మిమ్ములను అక్క అనాలా లేదా ఆంటీ అనాలా అంటూ ప్రశ్నించాడు. అందుకు అనసూయ ఇచ్చిన సమాధానం సగటు నెటిజన్ కు షాకింగ్ గా అనిపించింది. నన్ను ఎలా పిలవనక్కర్లేదు. నన్ను ఏదో ఒక వరుస పెట్టి పిలవడానికి నేను ఏమైనా నీకు తెలుసా... నేను ఎవరో నీకు తెలియదు. అలాంటప్పుడు నన్ను అక్క అనడానికి నువ్వు ఎవరు అంటూ అనసూయ షాకింగ్ కామెంట్స్ చేసింది. నువ్వు ఒకవేళ అలా పిలిస్తే ఏజ్ షేమింగ్ కిందకు వస్తుంది. కనుక నిన్ను పెంచిన వారినే అప్పుడు అనాల్సి వస్తుందంటూ అనసూయ సమాధానం ఇచ్చింది. ఒక అభిమాని గౌరవం ఇచ్చి అక్క లేదా ఆంటీ అని పిలవాలా అంటూ అభిమానం చూపించగా ఎందుకు ఇలాంటి సమాధానం అంటూ ఆమెపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

అక్క లేదా ఆంటీ అని పిలిచినంత మాత్రాన అవమానించడం అస్సలు కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మీకు నచ్చిన విధంగా నన్ను పిలుచుకోండి.. అది మీ సంస్కారం మరియు మీ యొక్క అభిమానం అని వదిలేసి ఉంటే ఖచ్చితంగా మీ యొక్క గౌరవం అనేది పెరిగి ఉండేది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి సందర్బాల్లో ఆవేశంతో సమాధానం ఇవ్వకుండా కాస్త ఆలోచించి.. ముందు ముందు ఎదుర్కోవాల్సిన కామెంట్స్ ను దృష్టిలో పెట్టుకుని సమాధానాలు ఇస్తే బాగుంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా అనసూయ షార్ట్ టెంపర్ తో వ్యవహరించింది.. ఈసారి మళ్లీ అదే తరహాలో వ్యవహరించి తన స్థాయిని తానే తగ్గించుకుంది అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అనసూయ దీనికి ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.