యోగాతో ఆకట్టుకుంటున్న గ్లామరస్ యాంకరమ్మ!!

Thu Jul 16 2020 22:00:02 GMT+0530 (IST)

Glamorous Anchor impressing with yoga !!

బుల్లితెర స్టార్ యాంకర్ అనసూయ.. గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఈ గ్లామర్ బ్యూటీ బుల్లితెర పైనే కాదు ప్రస్తుతం వెండితెర పై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. అనసూయకు అందాలతో మాయ చేయడం కొత్తేమీ కాదు. టీవీలో.. సినిమాలలోనే కాదు సోషల్ మీడియాలో కూడా అనసూయ అందాలకు క్రేజ్ మాములుగా లేదు. ప్రస్తుతం ఇంటికే పరిమితం అయిన యాంకరమ్మ.. ఎల్లప్పుడూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉంది. ఇక అనసూయ అలవాట్లు అభిరుచులు తెలుసుకోవడానికి అభిమానులు కూడా ఉత్సాహం చూపుతుంటారు. అలాంటి అనసూయ తాజాగా తన గ్లామర్ మెయింటైన్స్ సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టింది. తాజాగా పొట్టి డ్రెస్ ధరించి యోగ చేస్తూ కనబడింది. మరి యోగా మాములుగా చేస్తోందా.. బాబా రాందేవ్ గుర్తొచ్చేలా చేసిందని అంటున్నారు. కానీ ఆకట్టుకునే విధంగానే చేసిందనుకోండి. అనసూయ ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించినా ఆమె అభిమానులకు పండగే అని చెప్పాలి.ఇక ఇదివరకే ఈ భామ.. ఆమె గ్లామర్ సీక్రెట్స్ చెప్పింది. "నేను రోజూ ఓ గ్లాస్ రెడ్ వైన్.. కొన్ని డ్రై ఫ్రూట్స్ తింటాను. అవే నా గ్లామర్ సీక్రెట్' అంటూ షాక్ ఇచ్చింది. అనసూయ వైన్ తాగుతుంది అనేసరికి ఫ్యాన్స్ ఖంగుతిన్నారు. అంతేగాక "నేను వైన్ తప్ప ఇంకేమి తీసుకోను. అది నా గ్లామర్ సీక్రెట్ కాబట్టి వైన్ మాత్రమే అలవాటు చేసుకున్నాను. వైన్ అనేది గుండెకు ఎంతో మంచిది. అందుకే రోజు ఒక గ్లాస్ అయినా తీసుకుంటాను. వైన్ ఆకలిని కూడా తగ్గిస్తుంది. ఆకలిగా ఉంటే నిద్రపట్టదు. కాబట్టి గ్లాస్ రెడ్ వైన్ తాగుతాను. ఉపవాసాలు అంటారా.. అవంటే నాకు అసలు గిట్టదు. అందుకే ఫుల్ మీల్స్ బదులు గ్లాస్ రెడ్ వైన్ డ్రై ఫ్రూట్స్ తీసుకుంటానంటుంది" బ్యూటీ. కొసమెరుపుగా అందరి సంగతి పక్కన పెడితే నాకు మాత్రం వైన్ బాగా పనిచేస్తోందని అంటోంది. ఇక ప్రస్తుతం అనసూయ సినిమాలలో గ్లామర్ పాత్రలే కాకుండా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తుంది. క్షణం రంగస్థలం సినిమాలతో మంచి నటిగా అనసూయ గుర్తింపు పొందింది. త్వరలోనే కృష్ణవంశీ దర్శకత్వంలో రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుందట.