Begin typing your search above and press return to search.

బుల్లితెర.. వెండితెర ఇంకా రిబ్బన్ కటింగులు!

By:  Tupaki Desk   |   16 Feb 2020 5:30 PM GMT
బుల్లితెర.. వెండితెర ఇంకా రిబ్బన్ కటింగులు!
X
బుల్లితెరపై హాట్ యాంకరింగ్ తో భారీ గుర్తింపు సాధించిన హాట్ లేడీ అనసూయ భరద్వాజ్. 'క్షణం'.. 'రంగస్థలం' లాంటి సినిమాల్లో నటించి అందరినీ మెప్పించిన అనసూయకు ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రలు దక్కుతున్నాయి. అనసూయ క్రేజ్ పీక్స్ లో ఉండడంతో షాప్ ఒపెనింగులకు.. రిబ్బన్ కటింగులకు అనసూయను ఆహ్వానిస్తున్నారు.

ఒకవైపు ఇలాంటి షాప్ ఓపెనింగ్స్ తో పాటుగా మరోవైపు చీరల బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ తెగ బిజీగా ఉంది. బ్రాండ్ చీరల ప్రమోషన్స్ కోసం గ్లామరస్ ఫోటోషూట్లు కూడా చేస్తోంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం సరేసరి. తన లేటెస్ట్ ఫోటోలను ఇన్స్టాలో పోస్ట్ చేస్తూ అభిమానులను మురిపిస్తూ ఉంటుంది. చేతి నిండా సినిమా ఆఫర్లు కూడా ఉన్నాయి. సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో పాటుగా విజయ్ దేవరకొండ నిర్మించబోతున్న మరో సినిమాలో అనసూయకు ఆఫర్ వచ్చిందని సమాచారం. ఈ సినిమాలో అనసూయ విలన్ పాత్రలో నటిస్తుందని సమాచారం.

ఏదేమైనా అనసూయ మాత్రం ఊపిరిసలపనంత బిజీగా ఉంటోంది. బుల్లితెర నుంచి వెండితెర వరకూ కవర్ చెయ్యడమే గొప్ప విషయం. ఇక గ్యాప్ లో రిబ్బన్ కటింగులు.. బ్రాండ్ ప్రమోషన్స్ చేస్తూ తనకు తనే సాటి అనిపించుకుంటోంది. భవిష్యత్తులో యాంకర్.. హోస్టు కాదలుచుకున్నవారికి అనసూయ ప్రేరణగా నిలుస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.