Begin typing your search above and press return to search.

స్టార్ డైరెక్టర్ స్టోరీ.. వేశ్యగా అనసూయ?

By:  Tupaki Desk   |   3 July 2022 7:31 AM GMT
స్టార్ డైరెక్టర్ స్టోరీ.. వేశ్యగా అనసూయ?
X
ప్రముఖ జబర్దస్త్ యాంకర్ అనసూయ గత కొంతకాలంగా భిన్నమైన ప్రాజెక్టులతో తెలుగు చిత్ర పరిశ్రమలో బిజీగా మారుతున్న విషయం తెలిసిందే. ఎప్పుడైతే రంగస్థలంలో రంగమ్మత్తగా ఆమె కనిపించిందో అప్పటినుంచి కూడా చాలా మంచి అవకాశాలు వస్తున్నాయి. ఒకవైపు జబర్దస్త్ షోలో కనిపిస్తూనే మరొకవైపు అనసూయ విభిన్నమైన పాత్రలతో సినిమాలలో కూడా హైలెట్ గా కనిపిస్తోంది. అయితే ప్రస్తుతం ఆమె వరుస సినిమాల కారణంగా జబర్దస్త్ షోకు కూడా దూరమయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆ విషయం పక్కనపెడితే అనసూయ త్వరలో ఒక వేశ్య పాత్రలో కనిపించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి కన్యాశుల్కం ఆధారంగా రాసిన ఒక కథలో అనసూయ మధురవాణి అనే వేశ్య పాత్ర చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ప్రాజెక్ట్ కు ఇంతకుముందు క్రిష్ సినిమాలకు పనిచేసిన ఒక సహాయక దర్శకుడు డైరెక్ట్ చేయబోతున్నట్లు సమాచారం.

ఈ కథను వెబ్ సిరీస్ ఆధారంగా రెడీ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పూర్తిస్థాయిలో స్క్రిప్ట్ పనులు అన్నీ కూడా దర్శకుడు రెడీ చేసి తన టీమ్ కు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఇక వేశ్య పాత్ర కోసం కొంతమంది ప్రముఖ హీరోయిన్స్ ను సంప్రదించినప్పటికీ కూడా చివరికి యాంకర్ అనసూయను ఫైనల్ చేశారు. ఆ పాత్రలో మంచి భావోద్వేగం ఉంది అని అనసూయ స్టోరీ వినగానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం లేడి ఓరియెంటెడ్ ప్రాజెక్టులు చేస్తున్న యాంకర్ అనసూయ ఈ ప్రాజెక్టు కోసం సరికొత్తగా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కృష్ణవంశీ డైరెక్షన్లో తెరకెక్కుతున్న రంగమార్తాండ సినిమాలో కూడా ఆమె ఒక భిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఇక పుష్పా సెకండ్ పార్ట్ లో కూడా అనసూయ పాత్ర మరింత ఎక్కువగా హైలైట్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇక వీటితో పాటు ఇప్పుడు ఆమె వెబ్ సిరీస్ లో వేశ్య పాత్రగా నటించడానికి ఒప్పుకోవడంతో లైనప్ చాలా ఆసక్తికరంగా మారింది. మరి ఆ పాత్ర ఎలాంటి గుర్తింపును అందిస్తుందో చూడాలి.