రోజా మీద పంచ్.. అవసరమా అనసూయ?

Fri Jan 17 2020 11:00:01 GMT+0530 (IST)

Anasuya Punch On Roja At Local Gangs Show

కెలికి కంపు చేసుకోవటం కొంతమంది సెలబ్రిటీలకు అలవాటుగా మారింది. నోరు జారినా.. వెంటనే సర్ది చెప్పుకోవటమో.. లేదంటే కట్ చేయటం లాంటి జాగ్రత్తలు తీసుకోకుండా అనవసరంగా వివాదాల్లోకి జారిపోయే ప్రముఖులు కొందరు తరచూ కనిపిస్తుంటారు. హాయిగా యాంకరింగ్.. అప్పుడప్పడు నచ్చిన సినిమాల్లో పాత్రలు చేస్తూ.. బోలెడంత పేరు ప్రఖ్యాతుల్ని.. దానికి తగ్గట్లే సొమ్ములు చేసుకునే క్రమంలో నోరు జారాల్సిన అవసరం ఉందా? అన్నది క్వశ్చన్.తాజాగా ‘లోకల్ గ్యాంగ్స్’ షోలో రోజా మీద అనసూయన సరదాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. ఈ షోకు సంబంధించిన ఒక ప్రోమో తాజాగా విడుదలైంది. ఇందులో శేఖర్ మాస్టర్ ను ఉద్దేశించి యాంకర్ గా ఉన్న ప్రదీప్ చేసిన వ్యాఖ్యలు.. ఈ సందర్భంగా మధ్యలో దూరిన అనసూయ నోరుజారిన వైనం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

ఫైర్ బ్రాండ్ ఇమేజ్ ఉన్న రోజాతో స్నేహమే చేయాలే తప్పించి.. పంచ్ లు వేయకూడదన్న విషయాన్ని అనసూయ మర్చిపోయారా? అన్నది ప్రశ్న. శేఖర్ మాస్టర్ వేరే షోకు వెళ్లిపోయిన వేళ.. ఇక మన మాస్టర్ అన్నది ఉండదని ప్రదీప్ అంటే.. దానికి అనసూయ అం.. ఆ: వరకూ వెళ్లిందని కల్పించుకున్నారు. ఈ విషయం మీద రేపు మధ్యాహ్నం చర్చిద్దామని ఫోన్లో చెప్పినట్లుగా యాంకర్ ప్రదీప్ అంటే.. దానికి స్పందించిన అనసూయ.. యాంకరింగా? పక్కన పార్టీ లోనా? అంటూ నవ్వుతూ మాట కట్ చేశారు? దీనికి శేఖర్ మాస్టర్ ఎక్స్ ప్రెషన్ చూసినప్పుడు.. అంత సాహసం చేశావేంటి అనసూయ అన్నట్లుగా ఉంది.

ఏది ఏమైనా.. ప్రజాజీవితంలో ఉన్న వారి మీద.. దానికి సంబంధించిన మాటల్ని తొందరపడి అనకూడదు. ఇలాంటి మాటలతో లేనిపోని తలనొప్పులు ఖాయం. వ్యక్తిగతంగా ఎంత సన్నిహితమైన సంబంధమైనా ఉండొచ్చు. కానీ స్క్రీన్ మీదకు వచ్చినప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడాలి. లేదంటే తలనొప్పులు తప్పవు. మరి.. తనపై అనసూయ వేసిన పంచ్ ను రోజా లైట్ తీసుకుంటారా? అన్నది తేలాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే.