Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: హూ ఈజ్ దిస్ ఖ‌త‌ర్నాక్ బేబ్?

By:  Tupaki Desk   |   17 July 2020 12:30 AM GMT
ఫోటో స్టోరి: హూ ఈజ్ దిస్ ఖ‌త‌ర్నాక్ బేబ్?
X
డార్క్ లిప్స్.. బాబ్డ్ బేబి హెయిర్ కట్‌.. కొంటెగా క‌వ్వించే ఆ క‌నులు.. గుండ జిల్ల‌నే ఆ రెడ్ ఫ్రాక్.. హాఫ్ షోల్డ‌ర్ లుక్.. అస‌లింత‌కీ ఎవ‌రీవిడ‌? ఆవిడే ఈవిడా? ఏమో కుర్రాళ్ల‌కు ఏదో సందేహం. రంగ‌మ్మ‌త్త‌గా చీర‌క‌ట్టులో ఎంతో ఒద్దిక‌గా ఒదిగిపోయ‌న అన‌సూయ‌లో ఇన్ని కోణాలున్నాయా?

ఆ మెడ‌లో BABE అనే అక్ష‌రాల‌తో ప‌చ్చ‌ల‌ హారం చూశాక మాత్రం ఏదో ఒక‌టి ఫిక్స‌యిపోవాలి. హు ఈజ్ దిస్ బేబ్? అల్ట్రా మోడ్ర‌న్ బేబ్ అనాలా..? ఖ‌త‌ర్నాక్ బేబ్ అని పిల‌వాలా? ఏమో ఈ లుక్ చూడ‌గానే కుర్రాళ్ల గుండెలు ధ‌డేల్ ధడేల్. మ‌రోసారి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప చిత్రంలో న‌టిస్తోంది. ఆ మూవీలో ఇలాంటి లుక్ తోనే క‌నిపిస్తుందా ఏమిటి?

అడ‌వులు.. ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో చిత్తూరు రాజ‌కీయాల‌కు సంబంధం ఉంటుంది. పైగా కార్పొరెట్ గాళ్స్ తో లింక‌ప్ అయిన‌ చంద‌నం దుంగ‌ల ముఠాని అప్ప‌ట్లో ప‌ట్టుకున్నారు. ఆ గ్యాంగ్ లో చిక్కిన కిలాడీ లేడీగా అన‌సూయ న‌టిస్తుందా? లేక అడ‌విలో గిరిజ‌న బిజిలీగా క‌నిపిస్తుందా? అన్న‌ది ఇంకా స‌స్పెన్స్. అన‌సూయ పాత్ర‌పై ర‌క‌ర‌కాల ఊహాగానాలు సాగినా ఏవీ అధికారికంగా క‌న్ఫామ్ కాలేదు. జ‌బ‌ర్ధ‌స్త్ అన‌సూయ‌కు .. రంగ‌మ్మ‌త్త‌కు మించిన మ‌రో కొత్త కోణం ఏదో దాగి ఉంద‌ని మాత్రం ఇప్ప‌టికి అర్థ‌మ‌వుతోంది.