హాట్ యాంకర్ కళాత్మక భంగిమకు మతి చెడేనే

Thu Jun 17 2021 21:00:01 GMT+0530 (IST)

Anasuya Latest Photo

రామ్ చరణ్ `రంగస్థలం`లో కళాత్మక పాత్రతో మెప్పించింది అనసూయ. భర్తను కోల్పోయి ఒంటరి అయిన రంగమ్మత్త గా అద్భుతమైన ఆహార్యంతో మెప్పించింది. ఇక ఇదే చిత్రంలో రామలక్ష్మి పాత్రలో సమంత నటన అసమానం. ఒక రకంగా సమంత కంటే అనసూయకే ఎక్కువ మార్కులేశారు అభిమానులు. యువతరంలో తన పాపులారిటీ అమాంతం పెరిగిందన్నది అందరూ అంగీకరించే విషయం.ఇక ఇటీవలి కాలంలో వరుసగా అన్ని ఇండస్ట్రీల్లోనూ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్న అనసూయ ఫోటోషూట్ల పరంగానూ సాటి నాయికలతో పోలిస్తే ఎక్కడా తగ్గడం లేదు. అనసూయ తాజా ఫోటోషూట్ అభిమానుల్లో వైరల్ గా మారింది.

ఆన్ లొకేషన్ ఓ చెక్క బల్లపై కూచుని ఎంతో కళాత్మకంగా ఫోజిచ్చింది అనసూయ. మోడ్రన్ స్టైల్ మిడ్డీలో ఎంతో అందంగా కనిపిస్తోంది. ఇక ఆ థై స్లిట్ ఎలివేషన్ సంథింగ్ స్పెషల్ అని చెప్పాలి. ఆ అందమైన కురులను సవరిస్తూ అలంకరించిన చెంప పిన్నీసు .. మెడలో స్లిమ్ గా ఉన్న నక్కిలీసు గొలుసు అనసూయ లుక్ లో మెరుపును పెంచాయని చెప్పాలి. ఖిలాడీ- పుష్ప- రంగమార్తాండ లాంటి క్రేజీ చిత్రాల్లో అనసూయ నటిస్తోంది.