Begin typing your search above and press return to search.

అనసూయ‌కి పండుగాడ్ బ‌ర్త్ డే స‌ర్ ప్రైజ్

By:  Tupaki Desk   |   15 May 2022 1:37 PM GMT
అనసూయ‌కి పండుగాడ్ బ‌ర్త్ డే స‌ర్ ప్రైజ్
X
యాంక‌ర్ క‌మ్ న‌టి అన‌సూయ కెరీర్ దేదీప్యమానంగా సాగిపోతుంది. ఓ వైపు టీవీషోలు చేస్తూనే మ‌రోవైపు సినిమా ఛాన్సుల‌తోనూ బిజీగా ఉంటుంది. యాడ్ షూట్ లోనూ అంతే ఉత్సాహ‌న్ని ప్ర‌ద‌ర్శిస్తుంది. మెగాస్టార్ చిరంజీవితోనే క‌లిసి యాడ్ చేసే స్థాయికి అన‌సూయ ఎదిగింది. ఇలా మూడింట అన‌సూయ సంపాద‌న భారీగానే ఉంది. ఇక సినిమాల్లో హీరోయిన్ గాను నటిస్తుంది.

ప్ర‌స్తుతం సునీల్ - అనసూయ భరధ్వాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సమర్పణలో రూపొందుతున్న 'వాంటెడ్ పండుగాడ్` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 'పట్టుకుంటే కోటి...' అనేది ఉపశీర్షిక. తాజాగా ఈ చిత్ర యూనిట్ అన‌సూయ పుట్టిన రోజు సంద‌ర్భంగా సినిమాకి సంబంధించిన అన‌సూయ ప్రోమో ఒక‌టి రిలీజ్ చేసి విషెస్ తెలిపారు.

ఇందులో అన‌సూయ హాట్ లుక్ లో క‌నిపిస్తుంది. రంగు రంగుల స్పాట్ లైట్ యువ‌రాణి త‌ర‌హాలో అన‌సూయ‌ని ప‌రిచ‌యం చేసారు. ఇందులో అన‌సూయ‌ ఆహార్యం స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. మేక‌ప్ నుంచి యాక్స‌రీస్ వ‌ర‌కూ ప్ర‌తీది ఫోక‌సింగ్ గా ఉంది. పొగ మంచుల్లో దాగిన అన‌సూయ అలా పైపైకి వ‌స్తుంది. బీజీఎమ్ అంతే హైలైట్ గా ఉంది. సినిమాలో అన‌సూయ పాత్ర డిఫ‌రెంట్ గా ఎలివేట్ అవుతుంది. ఈ చిత్రానికి శ్రీధర్ సీపాన దర్శకత్వం వహిస్తున్నారు. సాయిబాబా కోవెలమూడి.. వెంకట్ కోవెలమూడి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఈ సినిమాతో అన‌సూయ క‌ల కూడా నెర వేరుతుంది. రాఘ‌వేంద్రరావుతో సినిమా చేయాల‌ని అన‌సూయ ఎప్ప‌టి నుంచో క‌ల‌లు కంటోందిట‌. ఇప్పుడిలా ద‌ర్శ‌కేంద్రుడితో ప‌నిచేసే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా..గౌర‌వంగా భావిస్తోంది. ఇక ఈ సినిమాతో సునీల్ స‌ర‌స‌న న‌టించ‌డం రెండ‌వ సారి. ఇటీవ‌లే రిలీజ్ అయిన `పుష్ప` మొద‌టి భాగంలో మంగ‌ళం శ్రీను పాత్ర పోషించిన సునీల్ కి భార్య పాత్ర‌లో అన‌సూయ న‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే `ద‌ర్జా` అనే సినిమాలో ఈ కాంబినేష‌న్ ప్రేక్ష‌కుల్ని మెప్పించ‌డానికి రెడీ అవుతుంది. ఇలా ఒకేసారి ఏకంగా మూడు సినిమాలు సునీల్ తో చేయ‌డం విశేషం.