ఫోటో స్టోరీ: అనసూయ.. పింకు డ్రెస్సు కేకో కేక!

Mon Feb 24 2020 23:00:01 GMT+0530 (IST)

Anasuya Glamourous Poses in Pink Outfit

బుల్లితెరపై ఎంతో మంది యాంకర్లు ఉండొచ్చు కానీ అనసూయ భరద్వాజ్ రూటు మాత్రం సెపరేటు. మూసగా సోసోగా సా..గిపోతున్న తెలుగు యాంకరింగ్ ను జబర్దస్త్ గా మార్చేసి హాట్ అప్పీల్ ను తీసుకొచ్చిన ఘనత మాత్రం అనసూయకు ఇవ్వాల్సిందే. అనసూయ ఇచ్చిన గ్లామర్ టచ్ తో స్మాల్ స్క్రీన్ షేక్ అయిపోయింది. నిజానికి ఈ హాటు యాంకరింగ్ హిందీ టీవీలో ఎప్పటి నుంచో ఉన్నదే కానీ తెలుగువారు కూడా ఇప్పుడు అలవాటు పడ్డారు.ఒక్క బుల్లితెరతో సరిపెట్టుకోకుండా వెండితెరపై కూడా అనసూయ తన సత్తా చాటింది. అనసూయ అంటే గ్లామర్ మాత్రమే అనుకునే కొందరికి షాక్ ఇస్తూ 'క్షణం'.. 'రంగస్థలం' లాంటి సినిమాల్లో నటిగా తన సత్తా చాటింది.  'రంగస్థలం' లోని రంగమ్మత్త పాత్ర అనసూయను ఒక రకంగా స్టార్ ను చేసిందని చెప్పొచ్చు. ప్రస్తుతం అనసూయ చేతిలో క్రేజీ ఆఫర్లు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే అనసూయకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతూనే ఉంది కానీ తరగడం లేదు.  రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్లతో నెటిజన్లపై గ్లామర్ వాన కురిపిస్తుంది కాబట్టి వారు కూడా సంప్రదాయమనే గొడుగు పట్టుకోకుండా ఆ జడివానలో తడిసి ముద్దైపోతున్నారు. అనసూయ మాయలో పడిపోతున్నారు.

ఈమధ్య అనసూయ ఒక కార్యక్రమంలో పాల్గొంది.  ఎప్పటి లాగి కత్తి లాంటి స్లీవు లెస్సు పింకు డ్రెస్సు ధరించి.. తనదైన శైలిలో కిలాకిలా నవ్వుతూ గ్లామర్ ను ఆరాధించే హృదయాల వీణలను ఎడాపెడా మీటేసింది.  ఈ కార్యక్రమంలో అనసూయ ప్రదర్శించిన తొమ్మిది రకాల హావభాలను ఏర్చి కూర్చి ఒక కొలేజ్ తరహాలో చేసి సోషల్ మీడియాలో ఎవరో షేర్ చేయడంతో ఆ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది.  పొరపాటున డోనాల్డు  ట్రంపు కనుక ఈ నవరత్నాలను చూస్తే అనసూయను ఢిల్లీకి డిన్నర్ కి ఆహ్వానిస్తాడేమో!