పైపైకి ఒడ్డాణం...కెవ్వుమన్న నాభిఅందాలు!

Sat Feb 22 2020 13:15:47 GMT+0530 (IST)

Anasuya Glamorous Pose

తెలుగు టీవీ యాంకర్లు అంటే క్యూట్ గా మాత్రమే ఉంటారు అనేది కొన్నేళ్ళ క్రితం అందరి అభిప్రాయం.  ఆ అభిప్రాయాన్ని సమూలంగా మార్చేసింది అనసూయ భరద్వాజ్. వెండితెరపై హీరోయిన్లు ఎలా గ్లామరస్ గా ఉంటారో అలా బుల్లితెరపై ఉండొచ్చని హాటుగా తన చేతలతో నొక్కి ఒక్కాణించింది.  అలా అని టీవీకి మాత్రమే పరిమితమైపోకుండా ఈవెంటులకు హోస్టుగా కూడా సత్తా చాటింది.  సినిమాలలో కూడా నటించి నటిగా తనను తాను నిరూపించుకుంది.  'రంగస్థలం' లో రంగమ్మత్త పాత్ర అనసూయ క్రేజ్ ను మరింతగా పెంచింది.
 
హాట్ ఫోటో షూట్లు చేయడం.. గ్లామరస్ గా కనిపించి నెటిజన్లను మాయలో పడేయడం అనసూయకు మనం వాట్సాప్ మెసేజ్ చెక్ చేసినంత సులువు.  ఆ ఫోటోలను రెగ్యులర్ గా తన అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో రంగమ్మత్తకు భారీ ఫాలోయింగే ఉంది.  ఈమధ్య అనసూయ ఆకుపచ్చ రంగు ఛోళి.. లేహెంగా ధరించిన ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేసింది.  ఈ ఫోటోల్లో ప్రత్యేకత ఏంటంటే ఒడ్డాణం. అయితే అదేంటోకానీ ఒడ్డాణం ఉండాల్సిన ప్లేసులో లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. సహజంగా ఎవరైనా భామలు ఒడ్డాణం కొంచెం కింద నడుముకు పెట్టుకుంటారు. అనసూయ అక్కడ పెట్టుకుంటే రొమాంటిక్ లెజెండ్ కె. రాఘవేంద్రరావు గారి కళాపోషక.. రసాత్మక హృదయులైన అనుచరుల మనోభావాలు తీవ్రంగా.. దారుణంగా.. ఘోరంగా దెబ్బతింటాయని అనుకుందేమో కానీ నాభి అందాలకు మిల్లీ మీటర్ కూడా అడ్డురాకుండా కిలో మీటర్ పైన ధరించింది.ఇలాంటి రసరమ్యమైన ఫోటోలకు సోషల్ మీడియాలో సూపర్ రెస్పాన్స్ వస్తుంది కదా. సరిగ్గా అలాగే నెటిజన్లు డంగైపోయారు. ఈ మిడిల్ వేర్ టెక్నాలజీస్ కు సంబంధించిన MSc హిస్టరీ డిస్కషన్ పక్కన పెట్టి అనసూయ ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటే అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో ఒక కీలక పాత్ర పోషిస్తోంది.  ఇది కాకుండా విజయ్ దేవరకొండ నిర్మించబోయే సినిమాలో విలన్ పాత్ర చేస్తోందని సమాచారం.