అనసూయ చిత్తూరు చింతామణి!

Sat Dec 04 2021 20:00:01 GMT+0530 (IST)

Anasuya Chittoor Chintamani!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తోన్న `పుష్ప ది రైజ్` డిసెంబర్ 17న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే లిరికల్ సాంగ్స్ తో మ్యూజికల్ గా పెద్ద హిట్ అయింది. మరోవైపు ప్రచార చిత్రాల్ని విడుదల చేస్తూ అంచనాల్ని అంకంతకు పెంచేస్తోంది టీమ్. ఈనెల 6న ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే అంతకుముందే టీజింగ్ టీజర్ తో ఉత్కంఠని రేకెత్తించారు. 26 సెకెన్ల పాటు ఉన్న ఈ టీజ్ లో అనసూయ అలియాస్ రంగమ్మత్త విశ్వరూపం గ్లిమ్స్ కూడా ఎలివేట్ చేశారు. అనసూయపై వన్ ఫైన్ షాట్ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా వైరల్ అవుతోంది.7ఓ క్లాక్ బ్లేడ్ ని పంటితో కరిచి పెట్టుకుని బెడ్ పై ఉన్న ఒకనిపై లంఘించి చంపాలన్న కసి తో ఉన్న ఎక్స్ ప్రెషన్ ని అనసూయ అద్భుతంగా పండించింది. చీరకట్టులో పింక్ జాకెట్ ధరించి మెడలో బంగారు హారం..గోలుసు..చైన్ ధరించిన తీరు చూస్తుంటే తన పాత్రలో చాలా ఎమోషన్ ఉందని అర్థమవుతోంది. ఆ ఆహార్యాన్ని బట్టి అనసూయ చాలా పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నట్లే కనిపిస్తుంది. రంగమ్మత్త పాత్రలో పల్లెటూరి మాస్ కోణాన్ని చూపిస్తే.. పుష్పలో మాత్రం డబ్బు అహంతో బ్రతికే అనసూయని చూపిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇదే పాత్రలో అనసూయ హాట్ అందాల ఎలివేషన్ తో ఘాటైన సన్నివేశం ఉందని అర్థమవుతోంది. మరి ఈ పాత్ర రంగమ్మత్త పాత్రని మించి పండుతుందా? అంతకు మించి అనేలా ఉంటుందా? అన్నది వేచి చూడాలి.

డిసెంబర్ 6న రిలీజ్ అయ్యే టీజర్ లో కూడా అనసూయ పాత్ర గురించి ఏదైనా అప్ డేట్ ఇస్తారేమో చూడాలి. అయితే ఓ చిత్తూరు యువకుడు అనసూయ పాత్రని చూసి చిత్తూరు చింతామణిలా ఉందంటూ కామెంట్ చేసాడు. మరి ఈ చిత్తూరు చింతామణి ఎవరు? చిత్తూరులో ఎంత ఫేమస్ అన్నది కమింగ్ డేస్ లో తెలిసే అవకాశం ఉంది. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. పాన్ ఇండియా కేటగిరిలో సినిమా రిలీజ్ కానుంది. ఇది బాలీవుడ్ లో బన్నీకి డెబ్యూ సినిమాగా ప్రచారం సాగుతోంది.