Begin typing your search above and press return to search.

తెల్లచీరలో 'శ్వేతపుష్పం'లా హొయలుపోతున్న యాంకరమ్మ!!

By:  Tupaki Desk   |   6 Aug 2020 5:30 PM GMT
తెల్లచీరలో శ్వేతపుష్పంలా హొయలుపోతున్న యాంకరమ్మ!!
X
యాంకర్ అనసూయ అంటే తెలుగు ప్రేక్షకులకు ఫేవరెట్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తన యాంకరింగ్ తో.. తన అందమైన డాన్సులతో.. ముఖ్యంగా కుర్రకారును కట్టిపడేసే వయ్యారాలతో తెలుగువారి మనసులను దోచుకుంటుంది. సాధారణ టీవీ యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయను నేడు స్టార్ యాంకర్ అంటున్నారు అంటే ఆమె కష్టం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం అమ్మడు టీవీ ప్రేక్షకులు మెచ్చే యాంకర్ మాత్రమే కాదు.. సినీ ప్రేక్షకులు కోరుకునే యాక్టర్ కూడా.. ఒకవైపు యాంకరింగ్, మరోవైపు సినిమాలు బాలన్స్ చేసుకుంటుంది. టీవీలో జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ.. అదే షో ద్వారా తెలుగువారికి బాగా దగ్గరైంది. ఇక అనసూయకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

ఆమె గ్లామర్ తో ఎలాంటి వారినైనా ఆకట్టుకోగలదు. అనసూయ ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు తన సినిమాల విశేషాలు.. టీవీ షోల విశేషాలతో పాటు తన పర్సనల్ విషయాలు కూడా అభిమానులతో పంచుకుంటుంది. లాక్ డౌన్ కారణంగా ఇంతకాలం ఇంటికే పరిమితం అయిన ఈ భామ.. ఇటీవలే టీవీ ప్రోగ్రాంల షూటింగ్స్ ప్రారంభం కావడంతో మళ్లీ సోషల్ మీడియాలో తన అందాలను ఫోటోల రూపంలో పోస్ట్ చేస్తుంది. మరి అమ్మడు ఫ్యాన్స్ ఊరుకుంటారా.. అలా అనసూయ పోస్ట్ చేసిందో లేదో ఇలా లైక్స్.. షేర్స్ చేస్తూనే ఉంటారు. తాజాగా సోషల్ మీడియా వేదికగా అనసూయ వైట్ సారీలో కొన్ని అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో అనసూయ సోయగాలు చూస్తూ.. తెల్ల చీరలో శ్వేత పుష్పంలా ఉందంటూ ఫ్యాన్స్.. నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ యాంకరమ్మ ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉందని కూడా తెలుస్తుంది.